Skip to main content

Nannaya University Professors : వ‌ర్సిటీ అధ్యాప‌కుల‌కు 'రూసా' ప్రాజెక్టులు..!

Rashtriya Uchhatar Shiksha Abhiyan grants some projects to Adikavi Nannaya University faculty

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ అధ్యాపకులకు రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) కొన్ని ప్రాజెక్టులు మంజూరు చేసిందని ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. ఆంగ్ల విభాగం ఆచార్యులు కేఎస్‌ రమేష్‌, డాక్టర్‌ ఎన్‌.సజనరాజ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల ఆచార్యులు వై.శ్రీనివాసరావు, కేవీ స్వామి, డి.కల్యాణి, డాక్టర్‌ కె.నూకరత్నం, డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, డాక్టర్‌ పి.విజయనిర్మలకు ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. సంబంధిత పత్రాలను వారికి వీసీ శనివారం అందజేశారు. ప్రాజెక్టులను సమర్థవంతంగా పూర్తి చేసి, అందజేయాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ కూడా పాల్గొన్నారు.

Teachers Promotions : పీహెచ్‌డీ అర్హత లేకపోయినా ఉపాధ్యాయులకు పదోన్నతులు మంజూరు..!

Published date : 24 Jun 2024 09:29AM

Photo Stories