Teachers Promotions : పీహెచ్‌డీ అర్హత లేకపోయినా ఉపాధ్యాయులకు పదోన్నతులు మంజూరు..!
తిరుపతి సిటీ: యూనివర్సిటీ అధ్యాపకుల ప్రమోషన్ల విషయంలో కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్)కు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీపికబురు అందించింది. పదోన్నతుల విషయంలో అధ్యాపకుల విన్నపం మేరకు అర్హతా ప్రామాణికాలను సడలిస్తూ అన్ని యూనివర్సిటీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2018 నిబంధనల ప్రకారం అధ్యాపకులు పదోన్నతి పొందాలంటే పీహెచ్‌డీతో పాటు పబ్లికేషన్లపైన కఠిన నిబంధనలు విధించింది. దీంతో పీహెచ్‌డీ లేని అధ్యాపకులు పదోన్నతులకు నోచుకోలేదు.
Ambulance Driver Posts : పశువర్ధక శాఖ అంబులెన్స్‌లో డ్రైవింగ్ పోస్టులకు దరఖాస్తులు..
నిబంధనలు సడలించాలని అధ్యాపకులు పలు మార్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కు మొరపెట్టుకున్నారు. స్పందించిన యూజీసీ అధికారులు 2010 పాత నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ అర్హత లేకున్నా పదోన్నతి పొందేందుకు అర్హులేనని ఆదేశాలు జారీ చేసింది. పాత నింబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు అర్హులైన అధ్యాపకులు పదోన్నతులు పొందేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఎస్వీ యూని వర్సిటీలో సుమారు 22మంది, మహిళా వర్సిటీలో 12 మందికిపైగా అధ్యాపకులు లబ్ధిపొందే అవకాశం ఉంది. యూజీసీ నిబంధనల సడలింపుపై వర్సిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Learn Easy App : ఏఐ సహకారంతో 'లర్న్ ఈజీ' యాప్‌ని రూపోందించిన విద్యార్థి.. దీంతో ఉపయోగాలు ఇలా!