Learn Easy App : ఏఐ సహకారంతో 'లర్న్ ఈజీ' యాప్‌ని రూపోందించిన విద్యార్థి.. దీంతో ఉపయోగాలు ఇలా!
గోరంట్ల: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా ధీరజ్ అనే విద్యార్థి రూపొందించిన ‘లర్న్ ఈజీ’ ఎడ్యుకేషన్ యాప్‌ను డీఈఓ మీనాక్షి ఆవిష్కరించారు. గోరంట్లలోని బాలుర ఉన్నతపాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న గంధం ధీరజ్‌కు ఆరేళ్ల వయసు నుంచే కంప్యూటర్‌పై పరిజ్ఞానం పెంచుకుంటూ వస్తున్నాడు. యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ చూసి సొంతంగా సాధన చేస్తూ పరిణతి సాధించాడు.
Engineering Seats Unlimited : ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల పరిమితి ఎత్తివేత! కారణం ఇదే..
ఈ క్రమంలో నాలుగు నెలల నుంచి రోజుకు దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి తోటి విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక అంశాలను జోడించి పది లక్షల అక్షరాలతో 15వేల లైన్లతో ‘లర్న్ ఈజీ’ ఎడ్యుకేషనల్ యాప్ రూపొందించాడు. మండల విద్యాశాఖ అధికారులు దీని గురించి డీఈఓకు వివరించడంతో ఆమె శనివారం గోరంట్లకు విచ్చేసి రూపకర్తను అభినందించి, యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఇంటర్‌నెట్ అవసరం లేకుండానే యాప్‌లో విద్యా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ధీరజ్ జన్మదినాన్ని కుటుంబ సభ్యులు డీఈఓ సమక్షంలో నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో డీఈఓ మీనాక్షి యాప్ రూపకర్త ధీరజ్‌తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, గోపాల్, జాన్ రెడ్డప్ప, హెచ్‌ఎం గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Alumni Meet : కళాశాలకు పట్టుకొమ్మల్లాంటి వారు పూర్వ విద్యార్థులు..