Engineering Seats Unlimited : ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల పరిమితి ఎత్తివేత! కారణం ఇదే..
అనంతపురం: ఇంజినీరింగ్ కోర్సులో అపరిమితంగా సీట్లు భర్తీ చేసుకునేలా ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని ఎత్తివేసింది. కళాశాల యాజమాన్యాలు అదనపు బ్రాంచులకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తుండడంతో చాలా కళాశాలలు దరఖాస్తు చేశాయి. కొన్ని కళాశాలలకు ఇప్పటికే అనుమతి లభించింది.
నూతన విద్యా విధానానికి అనుగుణంగా..
ఇప్పటి వరకు ఉన్న విద్యా విధానం ప్రకారం ఒక్కో బ్రాంచ్‌లో గరిష్టంగా 240 సీట్లకే పరిమితి ఉంది. అయితే, నూతన జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా ఈ పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (స్థూల ప్రవేశాల నిష్పత్తి), డిమాండ్ మేరకు సీట్లు పెంచుకోవచ్చు. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో ఇప్పటికే 89 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేయగా, 75 కళాశాలలకు ఏఐసీటీఈ గుర్తింపు లభించింది. తక్కిన 14 ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు రావాల్సి ఉంది. మౌలిక సదుపాయాల పరిశీలనకు ఏఐసీటీఈ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాలను అమలు చేస్తోంది. కంప్యూటర్ సైన్సెస్ (సీఎస్‌ఈ) బ్రాంచ్‌కు డిమాండ్ అధికంగా ఉండడంతో కళాశాలలన్నీ దాదాపుగా ఇందులోనే అదనపు సెక్షన్లకు దరఖాస్తు చేశాయి. కొన్ని సీఎస్‌ఈతో పాటు ఈసీఈకి అనుమతి తీసుకుంటున్నాయి.
Alumni Meet : కళాశాలకు పట్టుకొమ్మల్లాంటి వారు పూర్వ విద్యార్థులు..
పెరగనున్న కన్వీనర్ కోటా..
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఇప్పటికే సీట్లు అధికంగా ఉన్నాయి. అయితే, ఒక్కో కళాశాలలో 1,000 సీట్లు ఉంటే, ఇందులో 650 కంప్యూటర్ సైన్సెస్, వాటి అనుబంధ కోర్సుల్లోనే ఉన్నాయి.కంప్యూటర్ సైన్సెస్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. తల్లిదండ్రులు బలవంతంగా కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో చేరేలా విద్యార్థులను ప్రేరేపిస్తుండడంతో అయిష్టంగానే తీసుకుంటున్నారు. మరికొన్ని కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్‌లో అదనపు సెక్షన్లకు అనుమతి తీసుకుంటున్నాయి. ఈ దఫా ఏఐసీటీఈ అదనపు సెక్షన్లు ఇవ్వనుండడంతో కన్వీనర్ కోటా కింద సీట్లు మరింత పెరగనున్నాయి.
అధునాతన కోర్సుల్లోనూ..
ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు అధునాతన కోర్సుల్లోనూ సీట్లు పెంచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిల్లోనూ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎమర్జింగ్ కోర్సుల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉండటం, విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలు సీఎస్‌ఈలో వీటిని తీసుకొచ్చాయి. మరికొన్ని కళాశాలలు సీఎస్‌ఈతో సంబంధం లేకుండా నేరుగా బ్రాంచ్‌లు నిర్వహించేందుకు ముందుకువచ్చాయి.
Pediatric PG Seats : ఈ విద్యా సంవత్సరం నుంచే మరో నాలుగు పీడియాట్రిక్ పీజీ సీట్లు అమలు..
Tags
- Engineering seats
- number of seats
- engineering colleges
- seats ulimited
- B Tech Admissions
- new academic year
- All India Council for Technical Education
- National Education Policy-2020
- Gross enrollment ratio
- engineering seats from limited to unlimited
- Education News
- Sakshi Education News
- Engineering admissions updates