Skip to main content

Pediatric PG Seats : ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మ‌రో నాలుగు పీడియాట్రిక్ పీజీ సీట్లు అమ‌లు..q

కొత్తగా వచ్చిన నాలుగు పిడియాట్రిక్‌ పీజీ సీట్లు 2024– 25 నుంచే అమల్లోకి రానున్నాయని ప్ర‌భుత్వ మెడికల్ క‌ళాశాల అధికారులు వివ‌రించారు..

పాలమూరు: పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు కొత్తగా పిడియాట్రిక్‌ విభాగంలో నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) శుక్రవారం మెయిల్‌ ద్వారా కళాశాల అధికారులకు తెలిపింది. కొత్తగా వచ్చిన నాలుగు పిడియాట్రిక్‌ పీజీ సీట్లు 2024– 25 నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతోపాటు ఈ ఏడాది అప్తామాలజీ, అనస్తీషియా విభాగాలకు సైతం పీజీ సీట్ల కోసం కళాశాల అధికారులు దరఖాస్తు చేయగా ఆయా విభాగాల్లో ప్రొఫెసర్లు లేరంటూ కారణం చూపుతూ ఎన్‌ఎంసీ తిరస్కరించింది.

New Degree College: దేవరకద్రకు డిగ్రీ కళాశాల మంజూరు

అయితే,  పాలమూరు మెడికల్‌ కళాశాలలోని అనస్తీషియాలో విభాగంలో ఆరేళ్లుగా, అప్తామాలజీ విభాగంలో నాలుగు ఏళ్లుగా ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు కళాశాల డైరెక్టర్‌ రమేష్‌ వెల్లడించారు. ఈ రెండు విభాగాలపై మరోసారి పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు అప్పీల్‌ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. పాలమూరు మెడికల్‌ కళాశాలలో ఇప్పటి వరకు 9 విభాగాల్లో 26 పీజీ సీట్లు ఉండగా కొత్తగా పీడియాట్రిక్‌ విభాగంలో వచ్చిన నాలుగు సీట్లతో 30కి చేరాయి. కళాశాలలో పీజీ సీట్లు పెరగడంతో వైద్య సేవలు మెరుగుపడనున్నాయి.

TGPSC: వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Published date : 24 Jun 2024 09:21AM

Photo Stories