TGPSC: వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
సోమవారం నుంచి వచ్చే జూన్ 22న వరకు జరగనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతోపాటు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు కొనసాగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షను పురస్కరించుకుని జూన్ 21న కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్, డిపార్ట్‌మెంటల్, గుర్తింపు అధికారులకు అవగాహన సమావేశం ని ర్వహించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షలో నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు.
అభ్యర్థులు కాలిక్యులేటర్లు, గణిత పట్టికలు, లాగ్ బుక్, సెల్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు తీసుకురావొద్దన్నారు. అభ్యర్థుల చెకింగ్, హాల్‌టికెట్ పరిశీలనకు గుర్తింపు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.