New Degree College: దేవరకద్రకు డిగ్రీ కళాశాల మంజూరు
Sakshi Education
దేవరకద్ర: దేవరకద్రకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైంది. జూన్ 21న హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ ప్రధానకార్యదర్శి బుర్రా వెంకటేశం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి జీఓ కాపీని అందజేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరుతుండగా.. ఎట్టకేలకు అందరి కల నెరవేరింది.
చదవండి: Degree Admissions : డిగ్రీ కళాశాలల్లో ఈ గ్రూపుల్లో అడ్మిషన్లు ప్రారంభం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్థిక అనుమతులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 24 Jun 2024 09:07AM