Alumni Meet : కళాశాలకు పట్టుకొమ్మల్లాంటి వారు పూర్వ విద్యార్థులు..
అనంతపురం: పూర్వ విద్యార్థులు కళాశాలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని యూపీఎస్సీ మాజీ సభ్యులు డాక్టర్ వై. వెంకట్రామిరెడ్డి అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో 1994–98 బ్యాచ్‌లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. ముఖ్య అతిథి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కళాశాలకు పట్టుకొమ్మల్లాంటి వారు పూర్వ విద్యార్థులేనని పేర్కొన్నారు. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు మీ అనుభవాలు, సలహాలు ఎప్పటికీ ఉండాలని కోరారు. పూర్వ విద్యార్థుల సంఘం కళాశాలకు బలం అని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్ మాట్లాడుతూ ఇక్కడ ఇంజినీరింగ్ చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. తద్వారా కళాశాలకు జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చాయన్నారు. యూనివర్సిటీ పురోగతికి పూర్వ విద్యార్థుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాలలో చదివిన వారు గొప్ప పదవుల్లో ఉన్నారన్నారు. చాలా నిబద్ధత గల విద్యార్థులు ఉండడమే ఇందుకు కారణమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులను సత్కరించారు. అప్పటి ప్రొఫెసర్ అయిన డాక్టర్ వై.వెంకట్రామిరెడ్డిని ఘనంగా సన్మానించారు.
Pediatric PG Seats : ఈ విద్యా సంవత్సరం నుంచే మరో నాలుగు పీడియాట్రిక్ పీజీ సీట్లు అమలు..
కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం డైరెక్టర్ ప్రొఫెసర్ పి.సుజాత, ప్రొఫెసర్ శోభాబిందు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ.అరుణకాంతి, ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య, ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, డాక్టర్ జి.మమత, డాక్టర్ కేఎఫ్ భారతి, అజిత, డాక్టర్ కళ్యాణి రాధ, పూర్వ విద్యార్థులు మల్లికారెడ్డి, మనీష్ పంపత్వార్ (డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్), సాయి కిరణ్ (సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సస్టైనబులిటీ సొల్యూషన్స్), కిరణ్ నల్లగొండ (సీనియర్ ప్రిన్సిపాల్ ఆర్కిటెక్ట్) తదితరులు పాల్గొన్నారు.
Anganwadi teachers workers news: అంగన్‌వాడీ టీచర్లకు, వర్కర్లకు గుడ్‌న్యూస్..