Skip to main content

Anganwadi teachers workers news: అంగన్‌వాడీ టీచర్లకు, వర్కర్లకు గుడ్‌న్యూస్‌..

Namgani inspecting the training program for Anganwadi workers  Anganwadi teachers workers news  District Women Welfare Officer Namgani speaking to Anganwadi workers
Anganwadi teachers workers news

సారంగపూర్‌: ప్రతీ అంగన్‌వాడీ కార్యకర్త శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న అంశాలకు అనుగుణంగా కేంద్రాల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారి నామగణి అన్నారు. మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోని మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నిర్మల్‌ ప్రాజెక్టు పరిధిలోని పూర్వ ప్రాథమిక విద్యాబోధన శిక్షణను శుక్రవారం ఆమె పరిశీలించారు.

Junior Lineman jobs news: జూనియర్‌ లైన్‌మెన్ల(జేఎల్‌ఎం)ఎంపిక పరీక్ష ఎప్పుడంటే..

ఈసందర్భంగా ఆమె శిక్షణలో అంగన్‌వాడీ కార్యకర్తలు నేర్చుకున్న అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న పూర్వ ప్రాథఽమిక విద్యాబోధన అంశాలను పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు.

ఈ శిక్షణలో చెప్పే అంశాలు 3 నుంచి ఆరు ఏళ్లలోపు పిల్లల అవసరాలకు అనుగుణంగా రూపొందించారని తెలిపారు. శిక్షణలో భాగంగా మాస్టర్‌ ట్రైనర్లు విజయగౌరి, మంగళ, జ్యోతి ఇప్పటి వరకు నేర్పించిన అంశాలను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. శిక్షణ ఇస్తున్న మాస్టర్‌ ట్రైనర్లను అభినందించారు.

కార్యక్రమంలో శిక్షణ నోడల్‌ అధికారి నిరంజన్‌రెడ్డి, నిర్మల్‌ ప్రాజెక్టు బ్లాక్‌ కోఆర్డి నేటర్‌ రాము, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Published date : 24 Jun 2024 09:19AM

Photo Stories