Semester Exams Results : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల.. ఈ విభాగాల్లో ఉత్తీర్ణత!q
Sakshi Education
అనంతపురం: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాలను శనివారం ఎస్కేయూ వీసీ హుస్సేన్‌రెడ్డి విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరీక్ష ఫలితాల్లో ఆర్ట్స్ విభాగంలో 94 శాతం, కామర్స్‌లో 99 శాతం, సైన్స్‌లో 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి తెలిపారు. అలాగే రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్కే యూనివర్సిటీ ఎగ్జామ్స్ డీన్ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లోకేష్, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చలపతి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
Alumni Meet : కళాశాలకు పట్టుకొమ్మల్లాంటి వారు పూర్వ విద్యార్థులు..
Published date : 24 Jun 2024 09:26AM