Skip to main content

PM Internship Applications : టెన్త్‌, ఇంట‌ర్ పాసైన యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. పీఎం ఇంటర్న్‌షిప్ ద్వారా రూ.6000/-.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ పాసైన యువ‌త‌కు మంచి కంపెనీల‌లో ఇంటర్న్‌షిప్‌లను అందించడానికి నైపుణ్యాభివృద్ధి శాఖ 2024-25 సంవత్సరానికి ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించింది.
PM Internship Applications  2024-25 internship scheme for school and college passouts

ఈ పథకం కింద ఒక కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వారి నైపుణ్యాలను పెంచుకునే అవకాశం కల్పించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.  

అర్హ‌త‌లు ఇవే...
21 ఏళ్ల‌ నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 2023-24 సంవత్సరానికి కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల పరిమితి ఉండాలి.
కుటుంబ సభ్యుల్లో ఎవరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులుగా ఉండకూడదు.

స్టైఫండ్ ఇలా..
ఇంటర్న్‌షిప్ శిక్షణ 12 నెలల పాటు ఉంటుంది. శిక్ష‌ణ స‌మ‌యంలో.. నెలకు స్టైఫండ్ రూ.5000/- ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు కంపెనీ నిర్వహించే ప్రదేశానికి వెళ్లి శిక్షణ పొందుతారు. ఇంటర్న్‌షిప్ పూరైన‌ తర్వాత రూ.6000/-ల‌తో పాటు.. సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.

Published date : 05 Apr 2025 03:56PM

Photo Stories