Skip to main content

Retired Professors: విధుల్లోకి రిటైర్డ్‌ ప్రొఫెసర్లు.. కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకానికి నోటిఫికేషన్‌

రిటైర్‌ అయిన ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది ప్రభత్వం. విధుల్లోకి వస్తున్న ఆ ప్రొఫెసర్ల పోస్టులు ఇవే..
Healthcare notification   Government Orders retired medical professors on duty again    Retired professor re-engagement notification

కర్నూలు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇటీవల రిటైర్డ్‌ అయిన ప్రొఫెసర్లను తిరిగి కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సైతం ఇటీవల విడుదల చేసింది. దరఖాస్తు చేసుకుని ఎన్నికైన వారికి సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అయితే ప్రొఫెసర్‌కు రూ.2.5 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.2 లక్షలు, స్పెషాలిటీ విభాగాల్లో అయితే ప్రొఫెసర్‌కు రూ.2 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు వేతనం చెల్లించనున్నారు. 

TGRDC CET 2024 Notification: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆర్‌డీసీ సెట్‌ 2024

ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో వీరిని నియమించనున్నారు. అవసరమైతే కాంట్రాక్టు ముగిసిన తర్వాత మరికొన్ని సంవత్సరాలు వీరి సేవలను పొడిగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. కర్నూలు వైద్య కళాశాలలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, సర్జికల్‌ ఆంకాలజీ, మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలలో ఒక్కో పోస్టు, ఆబ్‌స్ట్రిక్‌ గైనకాలజీలో రెండు, డీవీఎల్‌లో ఒక పోస్టు ఖాళీగా చూపించారు.

Department of Agriculture: తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి

అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్లకు గాను అనాటమిలో మూడు, ఆబ్‌స్ట్రిక్‌ అండ్‌ గైనకాలజీలో రెండు, రేడియో డయాగ్నోస్టిక్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, సీటీవీఎస్‌, న్యూరాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీలో ఒక్కో పోస్టును చూపించారు. అర్హులైన, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు కర్నూలు మెడికల్‌ కాలేజిలోని ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Published date : 21 Mar 2024 05:33PM

Photo Stories