Department of Agriculture: తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధి
వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ సమేతి, వ్యవసాయ శాఖ ఆర్థిక సహాయంతో గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై ఏడు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని మార్చి 20న ఆయన ప్రారంభించి మాట్లాడారు.
చదవండి: Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
తేనెటీగల పెంపకంతో ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. బ్యాంక్ పరంగా సబ్సిడీలు, లోన్స్ రైతులు, యువతకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్ నరేష్, మృత్తిక శాస్త్రవేత్త కిరణ్‌లు మాట్లాడుతూ ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం ఉద్దేశం తేనెటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయంలో లాభాలు, కేవీకేలో జరిగే వివిధ శిక్షణ కార్యక్రమాల, ఉత్పత్తుల గురించి వివరించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి ఆదర్శ్, మాధురి, రైతులు తదితరులు పాల్గొన్నారు.