Campus Selections: ఐటీఐ ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు క్యాంప‌స్ సెలెక్ష‌న్స్‌..

ఐటీఐ విద్యార్థులకు క్యాంపస్‌ సెలెక్షన్స్‌ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎల్‌ఆర్‌ఆర్‌ కృష్ణన్‌ ప్ర‌క‌టించారు..

రాజమహేంద్రవరం: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 13వ తేదీన ఉదయం 9.00 గంటలకు ధవళేశ్వరంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో క్యాంపస్‌ సెలెక్షన్స్‌ నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎల్‌ఆర్‌ఆర్‌ కృష్ణన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌, వికాస, ఏపీఎస్‌ఎన్డీసీ, టాటా స్ట్రీవ్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఈ క్యాంపస్‌ సెలెక్షన్‌ నిర్వహిస్తున్నామన్నారు. హాజరయ్యే విద్యార్థులు తమ సర్టిఫికెట్స్‌, నకలు కాపీలు, రెజ్యూమ్‌తో పాటు హాజరు కావాలని ఆయన కోరారు.

TSPSC Group 1 Prelims: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ.. క్వాలిఫయింగ్‌ మార్కులు పెరిగే ఛాన్స్‌

#Tags