Skip to main content

Anganwadi Latest jobs News: తెలంగాణ అంగన్‌వాడీ లేటెస్ట్‌ న్యూస్‌..

Children attending free primary education at Anganwadi center  Anganwadi Latest jobs News  Officials issuing orders for free uniforms at Anganwadi center
Anganwadi Latest jobs News

ములుగు రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలను తీసుకు వస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు ఫ్రీ ప్రైమరీ విద్యాబోధన చేపట్టనున్నారు.

Students Free Bus Pass news: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..ఇకపై ఉచిత బస్‌పాస్‌

దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులను జారీ చేసింది.

జిల్లాలో 8,786 మంది..

జిల్లాలోని 9మండలాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను నాలుగు ప్రాజెక్టులుగా విభజించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలలో 0నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులు 7,714 మంది ఉండగా 3 నుంచి 6 సంవత్సరాల లోపు 8,786 మంది విద్యార్థులను గుర్తించి ఐసీడీఎస్‌ అధికారులు నివేదికలు అందజేశారు.

గతంలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా అందించేది. ఈ ఏడాది నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను ఫ్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చే క్రమంలో 3 నుంచి 6ఏళ్ల లోపు ఉన్న వారికి ఉచిత యూనిఫాం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అవసరమయ్యే వస్త్రాలను జిల్లా సంక్షేమాధికారులకు అందించింది.

 

మహిళా శక్తి సంఘాలకు అప్పగింత

అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు యూనిఫాం కుట్టి అందించే విధంగా మహిళా శక్తి సంఘాలకు బాధ్యతలను అప్పగించారు. యూనిఫాంకు సంబంధించిన డిజైన్‌లను ఎంపిక చేసి ీఅందించారు.

మగపిల్లలకు నిక్కర్‌, షర్ట్‌, ఆడ పిల్లలకు ప్రాగ్‌ కుట్టాలని సీ్త్ర–శిశు సంక్షేమశాఖ అధికారులు, డీఆర్‌డీఏ అధికారులు (సెర్ప్‌) మహిళా శక్తి సంఘాలకు యూనిఫాం క్లాత్‌ అందించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన కొలతలను సంవత్సరాల వారీగా నిర్ణయించారు.

అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు యూనిఫాం కుట్టించి ఇవ్వడంతో మహిళా సంఘాలకు ఆర్ధిక భరోసా కలిగినట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి జూలై మొదటి వారంలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంగన్‌వాడీ విద్యార్థుల యూనిఫాం డిజైన్లు

ప్రాజెక్టుల వారీగా కేంద్రాలు, విద్యార్థుల వివరాలు

ప్రాజెక్టు కేంద్రాలు 3–6ఏళ్ల

విద్యార్థులు

ములుగు 142 2,820

తాడ్వాయి 124 1,514

ఏటూరునాగారం 206 2,715

వెంకటాపురం(కె) 168 1,737

మొత్తం కేంద్రాలు 640 8786

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ

జిల్లాలో 3 నుంచి 6ఏళ్ల లోపు

చిన్నారులు 8,786

మహిళా శక్తి సంఘాలకు యూనిఫాం తయారీ అప్పగింత

వచ్చే నెల మొదటి వారంలో అందిస్తాం..

అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు యూనిఫాంను కుట్టించేందుకు మహిళా సంఘాలకు అప్పగించాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంలు కుడుతుండడంతో కొంత ఆలస్యం అవుతుంది. సంఘాలకు యూనిఫాం క్లాత్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే నెల మొదటి వారంలో చిన్నారులకు యూనిఫాం పంపిణీ చేస్తాం.

Published date : 22 Jun 2024 08:40AM

Photo Stories