Skip to main content

Free Training news: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Eligible candidates for training: BC, SC, ST unemployed graduates  Annual family income limit for applicants  Free Training news Applications invited for free civil services training under BC Study Circle
Free Training news

గద్వాల అర్బన్‌: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని, దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించరాదని పేర్కొన్నారు.

వచ్చే నెల 3వ తేదీ వరకు www.tsbcstudycircle. cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న అభ్యర్థులకు 9నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్స్‌తోపాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Published date : 22 Jun 2024 08:52AM

Photo Stories