Telangana Dussehra Holidays 2022 : దసరా సెలవులు.. విద్యార్థులకు మ‌రో శుభవార్త ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. బస్సుల వద్దకే ప్రయాణికులు రావడం కాదు.. ప్రయాణికుల వద్దకే బస్సును పంపే కార్యక్రమాన్ని చేపట్టింది.

పాఠశాలలకు ఈ నెల 25 నుంచి బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఇస్తున్న క్రమంలో వారి వారి స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్‌ వద్దకు ఆర్టీసీ బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు.

➤ Dussehra Holidays : ద‌స‌రా పండుగకు 22 రోజులు సెల‌వులు.. ఇక స్కూల్స్‌, కాలేజీ పిల్ల‌లకు అయితే..

30మందికి పైగా విద్యార్థులు ఒకే రూట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు లగేజీ బరువుతో బస్టాండ్‌కు చేరుకునే ఇబ్బందులు తప్పుతాయి. ఆటో, ఇతర రవాణా ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు, హాస్టల్‌ నిర్వాహకులు సమీపంలోని బస్‌ డిపోకు సమాచారం అందించాల్సి ఉంటుంది.

AP Schools Dussehra Holidays : ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..? తెలంగాణ‌లో మాత్రం..

సమాచారం ఇస్తే బస్సు పంపుతాం

దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్ళే విద్యార్థుల సౌకర్యార్థం వారి వద్దకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశాం. 30 మందికి పైగా విద్యార్థులుంటే సరిపోతుంది. బస్సు వారి ఆవాసం ఉంటున్న వసతి గృహం వద్దకు చేరుకుని విద్యార్థులను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్‌ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
– వంగాల మోహన్‌ రావు, వరంగల్‌–1 డిపో మేనేజర్‌   

15 రోజులపాటు సెలవులను అధికారికంగా..

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు.. ఈ ఏడాది దసరా పండుగకు 15 రోజులపాటు సెలవులను అధికారికంగా ప్రకటించించ విష‌యం తెల్సిందే. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు (15 రోజులు) సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది.

➤ TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.

#Tags