Skip to main content

Dussehra Holidays : ద‌స‌రా పండుగకు 22 రోజులు సెల‌వులు.. ఇక స్కూల్స్‌, కాలేజీ పిల్ల‌లకు అయితే..

ఈ సంవ‌త్స‌రం దుర్గాదేవి న‌వ‌రాత్రి ఉత్సవాల‌కు సెల‌వులు భారీగా రానున్నాయి. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.

ఈ వార్త చాలా మంది స్కూల్‌, కాలేజీ పిల్ల‌లతో పాటు ఉద్యోగులు కూడా చాలా సంతోష పడుతున్నారు. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్‌ హాలిడేస్‌ మహదానందాన్ని ఇస్తాయి. 

రానున్న దుర్గాపూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల పాటు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది.సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సెలవులు ఇచ్చింది. అంతేకాకుండా, మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సెలవుల సంఖ్య గతేడాది 16గా ఉంది. అలాగే తెలంగాణ‌లో ఈ సారి సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు).. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి 16 రోజులు సెలవులు రానున్నాయి.

సెలవుల కోసం ముందు నుంచే ఎంతో..
వీక్ అంతా పని చేసి, అలసిపోయిన వారికి సెలవు ఉపశమనం ఇస్తుంది. ఇక పండుగల సందర్భంగా వచ్చే సెలవులు ఇంకా ఆనందాన్నిస్తాయి. వీకెండ్ సాధారణమే అయినప్పటికీ పబ్లిక్ హాలీడేస్ ప్రత్యేకమని చెప్పాలి. టూర్లకు వెళ్లాలనుకునే వాళ్లు, కుటుంబంతో సరదాగా బయటపడాలనుకునే వాళ్లు సెలవుల కోసం ముందు నుంచే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక రోజులు, పర్వదినాలను హాలీడేస్ గా ప్రకటించింది. ఆ రోజుల్లో అన్ని రంగాల వారికి సెలవు ఇస్తుంది. 

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో..
ఇక స్కూల్ విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి, దసరా పండుగలకూ సెలవులు ఇస్తుంటారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అందుకే స్కూల్స్ కు, ఆఫీస్ లకు హాలీడేస్ మంజూరు చేస్తారు.
 
అత్యధికంగా సెలవులు కలిగిన రాష్ట్రంగా..
దేశంలో అతి తక్కువ పబ్లిక్‌ హాలిడేస్‌ ఉన్న రాష్ట్రం ఢిల్లీ (14 రోజులు) కాగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్‌ (15) నిలిచింది. తర్వాత కర్ణాటక (16) ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సెలవుల సంఖ్య 28 రోజులుగా ఉంది. అత్యధికంగా సెలవులు కలిగిన రాష్ట్రంగా ఒడిశా (34 రోజులు) నిలిచింది. తర్వాతి స్థానంలో జార్ఖండ్‌ (33), అసోం (32), హిమాచల్‌ ప్రదేశ్‌ (32)లు ఉన్నాయి.

కొన్ని జాతీయ సెలవులు మినహా.. 
పశ్చిమ బెంగాల్‌లో 28 ఉండగా, ఇప్పుడు దీనికి అదనంంగా 22 రోజులు ఇవ్వనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన 24 రాష్ట్రాల సగటు సెలవుల సంఖ్య 25 రోజులుగా ఉంది. వీటిలో 20 రోజుల కన్నా తక్కువ రోజులు సెలవులు ఉన్న రాష్ట్రాలు ఐదు ఉన్నాయి. అంటే కొన్ని జాతీయ సెలవులు మినహా ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు నిర్ణయిస్తున్నాయి.

Published date : 29 Aug 2022 11:38PM

Photo Stories