AP Schools Dussehra Holidays : ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..? తెలంగాణలో మాత్రం..
అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు స్కూల్స్‌కు దసరా సెలవులు రానున్నాయి.
క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6వరకు సెలవులు ఇచ్చారు. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలవులుగా ప్రకటించారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో ముందుగా దసరా సెలవుల గురించి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మేరకే దసరా సెలవులను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.
ఇక తెలంగాణలో మాత్రం భారీగానే సెలవులను..
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించింది. ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా సెప్టెంబర్ 13వ తేదీ (మంగళవారం) ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు (15 రోజులు) సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే అక్టోబర్ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు(దసరా) ఈ సారి స్కూల్స్, కాలేజీ భారీగా సెలవులను ఇచ్చారు.
➤ Dussehra Holidays : దసరా పండుగకు 22 రోజులు సెలవులు.. ఇక స్కూల్స్, కాలేజీ పిల్లలకు అయితే..
తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్రకటించారు. అలాగే ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి.