Swachhta Hee Seva : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం
గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అనంతరం పాఠశాల విద్యార్థులచే, కేసీసీ సిబ్బంది, నేషనల్ హైవే అథారిటీ సిబ్బందితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక పంచాయతీ పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థులతో రూపొందించిన ఇండియా చిత్రపటం ఆకట్టుకుంది. నేషనల్ హైవే పీడీ కార్తీక రెడ్డి, బిఎం లోహిర్, సైట్ ఇంజనీర్ మణి ప్రసాద్, స్థానిక సర్పంచ్ సుబ్రహ్మణ్యం యాదవ్, సీఐ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
Tags
- Swachhta Hee Seva Program
- Govt High School
- Students
- National Highways Department
- healthy
- awareness on cleanliness
- school level awareness program
- students education
- Education News
- Sakshi Education News
- SwachhataHiSeva
- CleanEnvironment
- GovernmentHighSchool
- GangadharaNellore
- NationalHighwaysDepartment
- EnvironmentalAwareness
- HealthAndHygiene
- SwachhBharatAbhiyan
- SakshiEducationUpdates