TechnOsmania 2024: ఓయూలో టెక్నోస్మానియా సందడి

ఉస్మానియా యూనివర్సిటీ: టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో టెక్నోస్మానియా–2024 జాతీయ స్థాయి టెక్నోకల్చరల్‌ ఫెస్ట్‌తో ఓయూ క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. బుధవారం వర్సిటీ ప్రవేశ ద్వారం ఎన్‌సీసీ గేటు వద్ద ‘నీటి చుక్కను పొదుపుగా వాడుదాం.. ప్రొటెక్ట్‌ ఎర్త్‌ ప్రిషియస్‌ వాటర్‌’ నినాదంతో ఏర్పాటు చేసిన 3కే రన్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ.చింత సాయిలు, టెక్నోస్మానియా కన్వీనర్‌ ప్రొ.శ్రీనునాయక్‌ జెండా ఊపి ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ టెంపుల్‌ వద్ద ఏర్పాటు చేసిన జూక్‌ బాక్స్‌ మ్యూజిక్‌కు ఒకేసారి వందలాది మంది విద్యార్థులు సామూహిక నృతంతో అలరించారు. అనంతరం కాలేజీ ఎదుట విద్యార్థులు చేసిన బైక్‌ స్టంట్‌ చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొ.రమేష్‌కుమార్‌, ప్రొ.వీవీ బసవరావు, ప్రొ.రాజం, కోర్డినేటర్‌ డా.పరశురామ్‌, డా.సాదం ఐలయ్య, డా.వి భాస్కర్‌, డా.శ్రీనివాసులు, స్టూడెంట్స్‌ కోఆర్డినేటర్లు శ్యామ్‌ సుందర్‌, మాధవి, ఆకాష్‌, అఖిల, ముఖేష్‌, పాహిత్య, సూరిదుర్గ, అరవింద్‌ పాల్గొన్నారు.
 

#Tags