Science Fair: రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రదర్శనలు ఈ విద్యార్థులవే..

మనిషి జీవితంలో ప్రతి మెట్టులోనూ సైన్స్‌ ఎంతో ఉపయోగకరంగా మారింది. సైన్స్‌ లేనిదే జీవితం లేదని వైజ్ఞానిక ప్రదర్శనకు హుజరైన డీఈఓ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థుల వివరాలను వెల్లడించి వారిని అభినందించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆలోచనలకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలోని మంగళకర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 84 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

Navodaya Entrance Exam: సాఫీగా సాగిన నవోదయ ప్రవేశ పరీక్షలు..

ఈ సందర్భంగా డీఈఓ మీనాక్షి మాట్లాడుతూ, మనిషి జీవితంలో ప్రతి మెట్టులోనూ సైన్స్‌ ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. సైన్స్‌ లేనిదే జీవితం లేదన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తోందన్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో సైన్సుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల రూపకల్పనకు సహకరించాలన్నారు. మండల, నియోజక వర్గ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను జిల్లా స్థాయికి ఎంపిక చేశామని, జిల్లా స్థాయి నుంచి 8 ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి పంపుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చూపి జిల్లాకు పేరుతేవాలని పిలుపునిచ్చారు.

SCERT: డెప్యుటేషన్‌ విధానంలో బోధన చేసేందుకు దరఖాస్తులు.. వీరే అర్హులు..

84 ప్రదర్శనలు..

మంగళకర కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానికి ప్రదర్శనలో మొత్తం 84 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. వీటిని మొదట విద్యా శాఖ అధికారులు, స్టేట్‌ కోఆర్డినేటర్‌, జ్యూరీ సభ్యులు తిలకించి మార్కులు వేశారు. అధిక మార్కులు వచ్చిన 8 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.

Practical Exams: ప్రాక్టికల్‌ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..

రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రదర్శనలు..

పరిగి మండలం ధనాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి నిఖిల (బయో డీగ్రేడబుల్‌ శానిటరీ న్యాప్‌కిన్స్‌), పెనుకొండలోని తోటగేరె ఉన్నత పాఠశాల విద్యార్థిని చరణ్యరెడ్డి (నో లేబర్‌ ఫర్నీస్‌), కుంటిమద్ది ఉన్నత పాఠశాల విద్యార్థిని దివ్య (సోలార్‌ ఇన్స్‌సెక్టిసైడ్‌ స్రేయర్‌), పేరూరు జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్‌ పాఠశాల విద్యార్థి ప్రేమ్‌కుమార్‌(న్యూ ఓటింగ్‌ మిషన్‌), తగరకుంట ఉన్నత పాఠశాల విద్యార్థి వంశీకుమార్‌ ( డ్యూయల్‌ స్టౌవ్‌ ఫర్‌ కుకింగ్‌), కొండకమర్ల ఉన్నత పాఠశాల విద్యార్థి ఆంజనేయులు నాయక్‌ (ఎల్‌పీజీ గ్యాస్‌ లీకేజీ డిటెక్టర్‌), కొత్తచెరువు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని లిఖితశ్రీ (డిజిటల్‌ హెల్త్‌ కార్డ్‌), సీకేపల్లి మండలం కనుముక్కల ఉన్నత పాఠశాలకు చెందిన సాకే నవ్య (ఆటోమేటిక్‌ వాటర్‌ పంపింగ్‌ ఇన్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జ్‌) ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జ్యూరీ మెంబర్‌ సుబ్రత్‌, విద్యాశాఖ ఏడీ రామకృష్ణ, డీసీఈబీ భాస్కర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటరమణ, జిల్లా కోఆర్డినేటర్‌ వెంకటస్వామి, ఎన్‌సీఎస్‌సీ జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, మంగళకర ఏఓ జయచంద్రారెడ్డి, సంస్కృతీ కళాశాల ప్రిన్సిపాల్‌ సెంథిల్‌ కుమార్‌, పలువురు సైన్స్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

#Tags