Practical Exams: ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు కొనసాగనున్నాయి. తొలిరోజు జిల్లాలో 55 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15,992 మంది జనరల్ విద్యార్థులు, 1,118 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరు కానున్నారు. రోజూ రెండు విడతలగా పరీక్షలు జరుగుతాయి. తొలివిడత ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
Technical Course: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు.. ఎప్పుడు..?
55 కేంద్రాల్లో 32 కేంద్రాలను ప్రైవేట్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. వీటికి ప్రభుత్వ అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమించారు. పరీక్షలు పకడ్బందీగా సాగేలా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఎగ్జామినర్లందరూ శనివారం రిపోర్ట్ చేసుకున్నారు.
Teachers: టాచర్లు సెలవులు లేకుండా పని చేయాలి..!
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ఈ సందర్భంగా ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ వెంకటరమణనాయక్ మాట్లాడుతూ ప్రాక్టికల్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా వసతులు కల్పించామన్నారు. అక్రమాలకు తావు లేకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో మార్కులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.