Skip to main content

Teachers: టీచర్లు సెలవులు లేకుండా పని చేయాలి..!

పాఠశాలను పరిశీలించేందుకు సందర్శించిన కలెక్టర్‌ అక్కడి వసతులను గుర్తించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలను ఇచ్చారు..
Improving school facilities  Collector Priyanka visit to Chandrugonda ZP School for inspection   School management receiving instructions

సాక్షి ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేవరకు ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వొద్దని కలెక్టర్‌ ప్రియాంక ఆల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మండలకేంద్రం చండ్రుగొండలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. ముగ్గురు ఉపాధ్యాయులు సెలవులపై ఉండటంతో హెచ్‌ఎంను ప్రశ్నించారు. ఇకపై పదో తరగతి పరీక్షలు పూర్తయ్యేవరకు సెలవులు ఇవ్వొద్దని సూచించారు.

Technical Course: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు.. ఎప్పుడు..?

మూత్రశాలలు లేవని, చండ్రుగొండ–జూలూరుపాడు రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు చేపట్టలేదని జెడ్పీటీసీ కొడకండ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ బాణోత్‌ పార్వతి, ఎంపీటీసీ దార వెంకటేశ్వరరావు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బదులిచ్చారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు సిద్ధం కావాలని, ఉన్న నెలరోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రద్ధగా చదువుకుని ఫస్ట్‌గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు.

Published date : 12 Feb 2024 03:22PM

Photo Stories