POLYCET Counselling Process: నేటి నుంచి పాలిటెక్నిక్ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ మొద‌లు.. ఎంపిక విధానం ఇలా..!

ఈ నెల 27 నుంచి నిర్వహించే కౌన్సెలింగ్‌లో, పాలిటెక్నిక్‌ కోర్సులలో అడ్మిషన్లకు ర్యాంకుల వారీగా ఇచ్చిన తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది..

రాయవరం: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. గత నెల 27న నిర్వహించిన పాలిసెట్‌లో జిల్లా వ్యాప్తంగా 3,732 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారు పాలిటెక్నిక్‌ కోర్సులలో అడ్మిషన్లకు ర్యాంకుల వారీగా ఇచ్చిన తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ నిర్వహించే కౌన్సెలింగ్‌లో వారి ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు.

Case on Teacher: హ‌ద్దు దాటిన రీల్స్ బ్యాచ్‌.. చివ‌రికి మూల్యాంక‌నంలో కూడా!

ఈ విద్యార్థులు కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్‌, రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నిక్‌ లేదా విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లి ఉచితంగా ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వారికి ఇచ్చిన తేదీ ప్రకారం ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పొందాలి.

  •  కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ఆన్‌లైన్‌లో ప్రాసెస్‌ ఫీజు చెల్లించాలి.
  •  ఫీజు చెల్లించిన రశీదు, పాలిసెట్‌ హాల్‌ టికెట్‌, ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్‌ అందజేయాలి.
  •  స్టడీ సర్టిఫికెట్‌ లేని వారు ఏడేళ్ల రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి.
  •  కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాన్‌ లోకల్‌ విద్యార్థులు మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌, పీడబ్ల్యూడీ, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, స్కౌట్‌, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్‌ వంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారు అర్హత ధ్రువీకరణ పత్రాలను కౌన్సెలింగ్‌ సమయంలో అందించాలి.

Digital Valuation: డిజిటల్ మూల్యాంక‌నంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు..

సీట్ల అందుబాటు ఇలా..

జిల్లాలోని రామచంద్రపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ప్రైవేటు యాజమాన్యంలో మరో ఐదు కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పలు కళాశాలల్లో ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్‌కు 60 నుంచి 120 వరకూ సీట్లు ఉన్నాయి. రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ 33, మెకానికల్‌ 33 చొప్పున, ఐదు ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సుమారు 1,500 సీట్లు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కింద ప్రతి బ్రాంచ్‌లో అదనంగా 10 శాతం సీట్లు పెంచి ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునేందుకు సైతం శిక్షణ ఇస్తారు.

షెడ్యూల్‌ ప్రకారం..

పాలిసెట్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, షెడ్యూల్‌ ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ర్యాంకు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది.

– డాక్టర్‌ సముద్రాల రామారావు, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ద్రాక్షారామ

TS Schools Reopening Date and New Timings 2024 : జూన్‌ 12వ తేదీ పాఠ‌శాల‌లు ప్రారంభం.. మారిన స్కూల్స్ టైమింగ్స్ ఇవే.. అలాగే..!

సర్టిఫికెట్ల పరిశీలన షెడ్యూల్‌

తేదీ ర్యాంకులు

మే 27 1 – 12,000

28 12,001 – 27,000

29 27,001 – 43,000

30 43,001 – 59,000

31 59,001 – 75,000

జూన్‌ 1 75,001 – 92,000

2 92,001 – 1,08,000

3 1,08,001–చివరి ర్యాంకు వరకూ

Cyclone Remal: దూసుకొస్తున్న 'రెమాల్' తుపాను.. ఇక్క‌డ భారీ వర్షాలు కురిసే అవకాశం!

జిల్లాలో పాలిటెక్నిక్‌ సీట్ల వివరాలు

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, రామచంద్రపురం: డీఎంఈ 33, డీసీఈ 33.

శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల: డీసీఈ 30, డీఎంఈ 30, డీఈఈ 60, డీఈసీఈ 60, డీసీఎంఈ 120, డీఏఐఎం 60.

బీవీసీ, ఇంజినీరింగ్‌ కళాశాల: డీసీఎంఈ 180, డీఈసీఈ 60, మెకానికల్‌ 30, ఈఈఈ 30.

వీఎస్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ 120, సీసీఎన్‌ 60, డీఈసీఈ 60, ఈఈఈ 60, మెకానికల్‌ 60.

శ్రీ వైవీఎస్‌ అండ్‌ శ్రీ బీఆర్‌ఎం పాలిటెక్నిక్‌ కళాశాల, ముక్తేశ్వరం: డీఈఈఐఈ 30, డీసీఎంఈ 54, డీఈసీఈ 60, డీఈఈఈ 108, డీఎంఈ 108.

కై ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రామచంద్రపురం: డీసీఎంఈ 120, డీఈసీఈ 60, సివిల్‌ 30, డీఈఈఈ 30, మెకానికల్‌ 30, ప్యాకింగ్‌ టెక్నాలజీ 30.

Tenth and Inter Students: ప‌ది, ఇంట‌ర్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన విద్యార్థుల‌కు అభినంద‌న‌లు..

అడ్మిషన్ల షెడ్యూల్‌

తేదీ ర్యాంకు

మే 31 1 – 50,000

జూన్‌ 1 1 – 50,000

2 – 3 50,001 – 90,000

4 – 5 90,001 – చివరి ర్యాంకు వరకూ

జూన్‌ 5 ఆప్షన్ల మార్పు

జూన్‌ 7: సీట్ల కేటాయింపు

 ప్రత్యేక కేటగిరీలకు చెందిన ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్‌, స్పోర్ట్స్‌, పీడబ్ల్యూడీ, క్యాప్‌, స్కౌట్‌ వంటి వారికి ఈ నెల 31 నుంచి జూన్‌ 3 వరకూ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ధ్రవీకరణ పత్రాలు పరిశీలిస్తారు.

JEE Main Advanced: జేఎన్టీయూలో ప్రశాంతంగా జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

#Tags