Skip to main content

Tenth and Inter Students: ప‌ది, ఇంట‌ర్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన విద్యార్థుల‌కు అభినంద‌న‌లు..

పోలీసు శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులైన 35 మంది విద్యార్థులను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్‌ మాట్లాడుతూ..
Appreciations for Tenth and Intermediate Best Rankers  Felicitation event for successful students in Kottagudem

కొత్తగూడెంటౌన్‌: విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌ ఆకాంక్షించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులైన 35 మంది విద్యార్థులను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలని, తద్వారా తల్లిదండ్రులతో పాటు తమ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

JEE Main Advanced: జేఎన్టీయూలో ప్రశాంతంగా జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

పోలీసు శాఖలో అహర్నిశలూ కష్టపడి విధులు నిర్వహిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. పట్టుదలతో సాధిస్తే సాధ్యం కానిది ఏదే లేదన్నారు. ఇంటర్‌, డిగ్రీ చదివే దశలోనే విద్యార్థుల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని, ఈ సమయంలోనే సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ విక్రాంత్‌సింగ్‌, కొత్తగూడెం, ఇల్లెందు డీఎస్పీలు అబ్దుల్‌ రెహమాన్‌, చంద్రభాను, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, వెల్ఫేర్‌ ఆర్‌ఐ కృష్ణారావు, ఎంటీఓ సుధాకర్‌, హోంగార్డ్‌ ఆర్‌ఐ నర్సింహారావు పాల్గొన్నారు.

Semester Exams: రేప‌టి నుంచి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం..

Published date : 27 May 2024 02:36PM

Photo Stories