Digital Valuation: డిజిటల్ మూల్యాంకనంపై అవగాహన సదస్సు..
Sakshi Education
వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ఈ సదస్సుకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యఅధికారి పి.యర్రయ్య డిజిటల్ మూల్యాంకనం గురించి వివరించారు..
బాపట్లటౌన్: ఇంటర్ విద్యలో డిజిటల్ ముల్యాంకనం అమలు వల్ల వేగం, ఖచ్చితత్వం సాధ్యమవుతుందని జిల్లా ఇంటర్ విద్యఅధికారి పి.యర్రయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం డిజిటల్ వాల్యూయేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ కళాశాలల నుంచి 508 మంది అధ్యాపకులు హాజరయ్యారు. సదస్సులో యర్రయ్య మాట్లాడుతూ పరీక్ష ఫలితాలు వేగంగా ప్రకటించవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్లు జి.వేదవతి, పి.సుధాకరరావు, సీహెచ్.సతీ బాబు పాల్గొన్నారు.
Tenth and Inter Students: పది, ఇంటర్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు..
Published date : 28 May 2024 11:11AM