Skip to main content

President Rule In Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Centre Has Issued Orders Imposing President Rule In Manipur

మణిపూర్‌లో గిరిజన జాతుల మధ్య జరుగుతున్న హింస నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించడానికి నిర్ణయం తీసుకుంది. గవర్నర్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోగా, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను అమలు చేసింది.

మణిపూర్‌లో హింస కారణాలు
మణిపూర్‌లో ప్రధానంగా కుకీ, మైతేయ్ తెగల మధ్య జరిగే ఘర్షణలు తీవ్రంగా రేగాయి. ఈ తెగల మధ్య గొడవలు ప్రపంచ వ్యాప్తంగా దృష్టి ఆకర్షించాయి. ఈ హింసకు ముఖ్యంగా, బీరెన్ సింగ్ పాత్ర ఉందని కొన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

రాజకీయ అస్థిరత: రాష్ట్రంలో గత కొంతకాలంగా శాంతిభద్రతలు దిగజారిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 2023 మే 3 నాటికి, మెయితేలు, కుకీలు మధ్య తీవ్ర ఘర్షణలు రేగాయి. ఈ ఘర్షణలు క్రమంగా అదుపులోకి రాలేదు.

Unani Medicine: యునాని వైద్యంపై అంతర్జాతీయ సదస్సు

ప్రాణ నష్టం: హింస కారణంగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 60,000 మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లలేక శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాలు కొనసాగించిన పహారాలో కూడా, రెండు తెగలు తమ ప్రాబల్య ప్రాంతాల్లోకి ఒకరినొకరు ప్రవేశించేందుకు సాహసం చేయడం లేదు. దీనివల్ల, నిరుపేద ప్రజల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది.

హింస యొక్క తీవ్రత: ఈ హింసను చూస్తుంటే, అనేక చోట్ల మహిళలను వివస్త్రలుగా చేసి, వారిపై ఆత్యాచారాలు జరిగాయి. ఈ ఘటనలు ప్రపంచంలో మన దేశ ప్రతిష్ఠకు మంటల కెల్లాయి.
 
అలాగే.. 2025 ఏప్రిల్ తర్వాత ఫిలిప్పీన్స్, భారతదేశానికి ఆకాష్ క్షిపణి వ్యవస్థలను ఆర్డర్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది.

Lok Sabha: లోక్‌సభలో 6 కొత్త భాషలకు అనువాద సేవలు

Published date : 14 Feb 2025 03:10PM

Photo Stories