New Courses in SKU: టెక్నాలజీ విప్లవంతో సరికొత్త ఉపాధి అవకాశాలు

నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచ పారిశ్రామిక రూపురేఖలను శరవేగంగా మార్చి వేస్తోంది..

అనంతపురం: ఇండస్ట్రీ–4 టెక్నాలజీ విప్లవంతో సరికొత్త ఉపాధి అవకాశాలు విస్తృతంగా దక్కుతున్నాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, వర్చువల్‌ రియాల్టీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, ఫుల్ట్సాక్‌ టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌.. ఇలా, అనేక నూతన సాంకేతికతలు అందుబాటులోకి రావడంతో పరిశ్రమల రూపురేఖలే మారిపోతున్నాయి.

TS Polycet 2024 Counselling Dates : టీఎస్ పాలిసెట్-2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదే.. రిజ‌ల్డ్స్ ఎప్పుడంటే..?

అయితే, ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకున్న నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఆయా పరిశ్రమలు నిపుణుల కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీ–4 టెక్నాలజీని ప్రవేశపెట్టడం అనివార్యమైంది. దీంతో భారీగా ఉద్యోగాలు దక్కనుండడంతో ఇంజినీరింగ్‌ కోర్సుల్లోనూ మార్పులు అనివార్యం అయ్యాయి. మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక విద్యలోనూ మార్పులు తప్పనిసరి అయ్యాయి.

AP SET Results 2024 Link : ఏపీ సెట్‌ ఫలితాలు విడుదల.. కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్‌ చేయండి

అధునాతన ప్రపంచంలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొని, ఉద్యోగావకాశాలు దక్కించుకునేలా విద్యార్థులను సంసిద్ధులను చేసే కార్యాచరణకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఎస్కేయూ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.

TS ECET 2024 Counselling Dates : టీఎస్ ఈసెట్‌-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

నాలుగు అధునాతన ప్రోగ్రామ్‌లు

ఎస్కేయూలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇప్పటికే బీటెక్‌, ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నారు. కొత్తగా బీటెక్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగంలో సీఎస్‌ఈ డేటా సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ అందుబాటులోకి రానున్నాయి. అలాగే కంప్యూటర్‌ సైన్సెస్‌ బ్రాంచ్‌లో ప్రస్తుతమున్న 60 సీట్లను 120కి పెంచారు. కొత్త కోర్సుల్లో ఒక్కో కోర్సుకు 60 చొప్పున సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కంప్యూటర్‌ సైన్సెస్‌ బ్రాంచ్‌కు 120, రెండు కొత్త కంప్యూటర్‌ అదనపు బ్రాంచ్‌లకు 120 కలిపి మొత్తం 240 కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో భర్తీ చేయనున్నారు.

Govt Medical College: నిర్మాణంలో ఉన్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌..

ఎంటెక్‌లో నూతనంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో థర్మల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, సీఎస్‌ఈ, ఈఈఈ కోర్సులు ఉన్నాయి. ఎంటెక్‌లో ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ అండ్‌ ఎంబీడెడ్‌ సిస్టమ్‌, సివిల్‌, మెకానికల్‌ కోర్సులు ఉన్నాయి.

Degree Final Year Results: ఆర్ట్స్ క‌ళాశాల‌లో డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..!

పరిశ్రమల యాజమాన్యాలతో ఒప్పందం

కోర్సులోనే పరిశ్రమల అనుభవం గడించేలా విద్యార్థులకు తర్పీదు ఇస్తున్నారు. ఇందుకోసం పరిశ్రమల యాజమాన్యాలతో ఎస్కేయూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జెన్సార్‌, కేపీఐటీ, ఈఎంసీ, ఐబీఎం, పర్‌సిస్టెన్స్‌ కంపెనీలు ఈ కోవలో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రైనింగ్‌, పరిశ్రమల సందర్శన, టెక్నికల్‌ కాంపిటీషన్స్‌, హైటెక్‌ లైవ్‌ ప్రాజెక్ట్స్‌, గెస్ట్‌ లెక్చరర్స్‌, స్పాన్సర్‌షిప్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో కోర్సు పూర్తి చేసిన వారికి కొలువులు విస్తృతంగా దక్కేలా చర్యలు చేపట్టారు.

2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 105 మంది విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో కొలువులు దక్కాయి. టీసీఎస్‌లో ఐదుగురు, ఇన్ఫోసిస్‌– 3, గ్లోబల్‌ క్వెస్ట్‌ టెక్నాలజీ –20, క్యూ–స్పైడర్‌ – 35, పెంటగాన్‌ స్పేస్‌ –15, పలె టెక్నాలజీస్‌ –14, విప్రోలో 2, ఇంటలెక్ట్‌– 1, యాక్సెంచర్‌ – 3, ప్రొడప్ట్‌ టెక్నాలజీ–5, హెచ్‌సీఎల్‌లో ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు.

TS EAMCET 2024 Counselling Important Dates : టీఎస్ ఈఏపీసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

కంపెనీ అవసరాలకు తగినట్లుగా...

కంపెనీల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తర్ఫీదు చేస్తే ఉపాధి అవకాశాలు తప్పక దక్కుతాయి. దీంతో బీటెక్‌లో రెండు, ఎంటెక్‌లో రెండు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాం. 2024–25 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇంజినీరింగ్‌ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు, అధునాతన సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడంతో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి.

– డాక్టర్‌ కె.హుస్సేన్‌రెడ్డి, వీసీ, ఎస్కేయూ

Jobs with NCC: ఎన్‌సీసీలో 'సీ' స‌ర్టిఫికెట్ విద్యార్థుల‌కు ఉన్న‌త ఉద్యోగాలు..

#Tags