Jal Jeevan Mission : గ్రామాల్లోని 77 శాతం ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం!
Sakshi Education
దేశంలోని గ్రామాల్లో ఉన్న 77 శాతం ఇళ్లకు నల్లా నీటి కనెక్షన్లు అందించినట్లు ‘జల్ జీవన్ మిషన్’ అధికారిక లెక్కలు వెల్లడించాయి. దేశంలోని మొత్తం గ్రామాల్లో 19.31 కోట్ల ఇళ్లు ఉన్నాయని.. వాటిలో 14.88 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించామని సంస్థ పేర్కొంది. నివేదిక ప్రకారం–11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాల్లో ఈ సదుపాయం 100 శాతం ఉంది. మరో 16 రాష్ట్రాల్లో 75–100 శాతం, ఐదు రాష్ట్రాల్లో 50–75 శాతం నల్లా నీటి సౌకర్యం ఉంది. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇది 50 శాతం కన్నా తక్కువ. 2024 కల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించాలన్న ఉద్దేశంతో 2019లో ‘జల్ జీవన్ మిషన్’ను ప్రారంభించారు.
Telecom Subscribers : దేశవ్యాప్తంగా 120.12 కోట్ల మంది టెలికం సబ్‌స్కైబర్లు..!
Published date : 25 Jun 2024 01:50PM