Vice Chancellors: 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం.. వీసీలుగా నియామకమైన ఐఏఎస్‌లు వీరే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్‌ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్‌ చాన్స్‌లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూ­నివర్సిటీకి ఒక్కో ఐఏఎస్‌ అధికారిని ఇన్‌చార్జి వీసీగా నియమించింది.

ఈ మేరకు మే 21న‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పద­వీ కాలం మే 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీ­లు ఇన్‌చార్జుల అధీనంలోకి వెళ్లాయి.

కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. 

చదవండి: TS EAMCET 2024: ఎంసెట్‌లో ఆ ర్యాంకు వస్తే.. టాప్‌ కాలేజీల్లో సీటు పక్కా

సెర్చ్‌ కమిటీలు వేసినా.. 

వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.

ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్‌ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు.

కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. 

చదవండి: UPSC IFS 2023 Topper Ritvika Pandey : ఫెయిల్ అయ్యా.. కానీ ఐఎఫ్ఎస్‌లో ఫస్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఆ కోరికతోనే..

ఏ యూనివర్సిటీ వీసీ కోసం ఎన్ని దరఖాస్తులు? 

యూనివర్సిటీ

వచ్చిన దరఖాస్తులు

అంబేడ్కర్‌ ఓపెన్‌

208

ఉస్మానియా

193

పాలమూరు

159

శాతవాహన

158

మహాత్మాగాంధీ

157

కాకతీయ

149

తెలంగాణ

135

జేఎన్టీయూహెచ్‌

106

తెలుగు వర్సిటీ

68

జేఎన్‌ఎఫ్‌ఏయూ

51

మొత్తం

1,382 

వర్సిటీల ఇన్‌చార్జి వీసీలుగా నియామకమైన ఐఏఎస్‌లు

ఉస్మానియా వర్సిటీ

దాన కిషోర్‌

జేఎన్టీయూహెచ్‌

బుర్రా వెంకటేశం

కాకతీయ వర్సిటీ

వాకాటి కరుణ

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ

రిజ్వీ

తెలంగాణ వర్సిటీ

సందీప్‌ సుల్తానియా

 తెలుగు యూనివర్సిటీ

శైలజా రామయ్యర్‌

మహాత్మాగాంధీ వర్సిటీ

నవీన్‌ మిట్టల్‌

శాతవాహన వర్సిటీ

సురేంద్ర మోహన్‌

జేఎన్‌ఎఎఫ్‌ఏ వర్సిటీ

జయేశ్‌ రంజన్‌

పాలమూరు వర్సిటీ

నదీం అహ్మద్‌ 

#Tags