Students Education: విద్యార్థులకు ఉన్నత విద్య అందించేలా ప్రభుత్వ చర్యలు..

ప్రతీ మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు జూనియర్‌ కళాశాలలు అందుబాటులో ఉండేలా, ఇందులో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

విశాఖ విద్య: పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రతీ మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు జూనియర్‌ కళాశాలలు అందుబాటులో ఉండేలా, ఇందులో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అవసరమైన చోట్ల దశల వారీగా కొత్త కళాశాలల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Distance Education: దూరవిద్య కోర్సులకు ప్రవేశాల నోటిఫికేషన్‌

ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్తగా ఎనిమిది జూనియర్‌ కాలేజీలు మంజూరు చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో జూన్‌ 1 నుంచి కాలేజీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైస్కూళ్లలో పనిచేసే క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయులను కొత్త కాలేజీల్లో సబ్జెక్టు అధ్యాపకులుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. వీరికి ఒక ఇంక్రిమెంట్‌ ఇవ్వనున్నారు.

Job Offer: ఉచిత శిక్షణ.. ఉపాధి అవకాశం..!

జిల్లాల వారీగా..

● విశాఖ జిల్లాలో గోపాలపట్నం మండలం వెంకటాపురం, మహారాణిపేట మండలం జీవీఎంసీ ఎంవీడీఎంహెచ్‌ఎస్‌ కురుపాం మార్కెట్‌, పద్మనాభం మండలం రెడ్డిపల్లి అగ్రహారంలో జూనియర్‌ కాలేజీ మంజూరైంది.

● అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం, నాతవరం, ఎస్‌. రాయవరం మండలం కొరుప్రోలు.

School Inspection: ఆశ్రమ పాఠశాల తనిఖీ..!

● అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు, పెదబయలు మండలం సీతగుంటలో కాలేజీలను మంజూరు చేశారు. ప్లస్‌–2 స్కూళ్లుగా గుర్తించే వీటిని పాఠశాలల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ చోటా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రతీ గ్రూపులో 40 మంది చొప్పున విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు.

NTPC Recruitment Notification: NTPCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, నెలకు రూ. 70వేల వేతనం

పట్టించుకోని గత టీడీపీ ప్రభుత్వం

కొత్తగా జూనియర్‌ కళాశాల మంజూరు కోసం గతంలో అయితే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. అందుబాటులో కళాశాలలు లేక, గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది విద్యార్థినులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితులు ఉండేవి. దీన్ని గుర్తించిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకేసారి ఏకంగా 34 కస్తూర్బా గాంధీ విద్యాలయాలను మంజూరు చేశారు. ఆ తరువాత వచ్చిన పాలకులెవ్వరూ కొత్త విద్యాసంస్థల మంజూరుకు శ్రద్ధ తీసుకోలేదు. మళ్లీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలోనే కొత్తగా జూనియర్‌ కాలేజీలు ఏర్పాటవుతుండటం గమనార్హం. వీటితో కలిపి ఈ నాలుగున్నకాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 18 కాలేజీలు మంజూరయ్యాయి.

#Tags