Skip to main content

Govt Schools Development: స‌ర్కారు బడుల్లో మౌలిక వ‌స‌తుల‌కు నిధుల విడుద‌ల‌.. మ‌ర‌మ్మ‌త్తులు ఇలా..!

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అన్ని విధాలుగా అభివృద్ధి మార్గంలో న‌డిపించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు..
Development and proper facilities at government schools as private

ఆదిలాబాద్‌: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు బడికి వెళ్లిన వారికి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ముందుకు సాగుతోంది. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. బడులు తెరిచే నాటికి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. జిల్లాలో డీఈవో పరిధిలో 702 పాఠశాలలు ఉండగా 664 పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన, ఇతర మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసింది. కార్పొరేట్‌ తరహాలో పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే పలు పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించగా, మిగతా పాఠశాలల్లో జూన్‌ నాటికి సౌకర్యాలు కల్పించనున్నారు.

JNTUA B.Tech& B.Pharmacy Exam Results: బీటెక్‌, బీఫార్మసీ ఫలితాలు విడుదల

మౌలిక వసతుల కోసం..

జిల్లాలో డీఈవో పరిధిలో 702 పాఠశాలలున్నాయి. వీటిలో 678 ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలలుండగా, 17 కేజీబీవీలు, ఆరు మోడల్‌ స్కూళ్లు, ఒక యూఆర్‌ఎస్‌ పాఠశాల ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో తాగునీరు, చిన్నపాటి మరమ్మతులు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుద్దీకరణ, బాలికల మరుగుదొడ్లు, ఇతర పనులు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సమాఖ్య మహిళా సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో ఏఎల్‌ఎఫ్‌ (ఏరియా లెవల్‌ ఫెడరేషన్‌) ద్వారా పనులు ప్రారంభమయ్యాయి.

Certificate Courses: ఈ నెల 15 నుంచి అడ్వాన్స్‌డ్‌ క్రియేటివిటీ సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభం..

25శాతం నిధులు విడుదల..

అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 664 బడుల్లో పనులు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రణాళిక తయారు చేసింది. ఇప్పటికే సంబంధిత గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పేరిట అకౌంట్లు ప్రారంభించారు. పాఠశాలలకు అవసరమైన పనులు అంచనా వేశారు. అయితే వీటిలో ఇప్పటికే 16 పాఠశాలల్లో మన ఊరు–మనబడి ద్వారా మౌలిక వసతులు కల్పించారు. మిగతా పాఠశాలల్లో ఏయే పనులు చేపట్టాలో.. ఎలాంటి సమస్యలున్నాయో గుర్తించారు. వీటి కోసం ప్రభుత్వం 25 శాతం నిధులు విడుదల చేసింది. రూ.20 కోట్ల 2 లక్షల 72వేల నిధులు అవసరమని అంచనా వేయగా, 25 శాతం నిధులు రూ.4కోట్ల 98లక్షల 89వేలు విడుదల చేసింది. 639 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా, 45 పాఠశాలల్లో మౌలిక వసతులకు సంబంధించి పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.

National Technology Day 2024: నేడు జాతీయ సాంకేతిక దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

సమస్యల పరిష్కారానికే..

జిల్లాలోని సర్కారు బడులు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీలు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు లేక అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల కిందట మన ఊరు–మనబడి ద్వారా మౌలిక వసతుల కోసం పనులు చేపట్టినా దాదాపు 20లోపు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. చిన్నచిన్న సమస్యలు పరిష్కారం కానున్నాయి. త్వరలో ప్రభుత్వం పాఠశాలలకు రంగులు వేయడం, డ్యూయల్‌ డెస్క్‌లు, గ్రీన్‌ చాక్‌బోర్డులు, సోలార్‌ ప్యానళ్లు ఏ ర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

EAPCET 2024 Entrance Exam: ఈఏపీసెట్ ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థుల సంఖ్య‌.. పేప‌ర్ ఇలా వ‌చ్చిందంటే!

అన్ని వసతులు కల్పిస్తాం

అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతుల క ల్పనకు చర్యలు చేపడుతున్నాం. తాగునీరు, మరుగుదొడ్లు, చిన్నచిన్న మరమ్మతులు తదితర పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 25శాతం నిధులు విడుదలయ్యాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.

– ప్రణీత, డీఈవో

                             ‘ఆదర్శం’ దిశగా బడులు

Published date : 11 May 2024 01:26PM

Photo Stories