Skip to main content

February 12th, 15th, 16th Holidays 2024 : ఫిబ్రవరి 12, 15, 16 తేదీల్లో సెలవులు. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో మ‌రో సారి రెండు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి. తెలంగాణ‌లో అత్యంత వైభవంగా జ‌రిగే.. నాగోబా జాతర కారణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన (సోమ‌వారం) ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీలు, కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Adilabad District Celebration    Nagoba Jatara Holiday  schools and colleges holidays   Telangana Government Announcement

ఈ సెలవుకు బదులు మార్చి నెలలో రెండవ శనివారం (మార్చి 9వ తేదీన‌) పని దినంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్ గ్రామంలో, ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమం కారణంగా ఈ సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులలో ప్రభుత్వం తెలిపింది.

☛ 10th Class Preparation Tips: టెన్త్‌ క్లాస్‌లో.. పదికి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించేందుకు సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ టిప్స్‌..

వ‌రుస‌గా రెండు రోజులు పాటు..

holiday news in telangana

అలాగే ఆదిలాబాద్ చుట్టుప‌క్క‌ల ఉన్న రెండు మూడు జిల్లాల‌కు కూడా ప్ర‌భుత్వం విద్యాసంస్థలకు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెలవు ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన ఆదివారం.. అలాగే ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వ‌డంతో.. వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు రానున్నాయి.

☛ SSC 10th Class Public Exams 2024: ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో కూడా సెలవు..?
బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించాడని బంజారాల విశ్వాసం. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు. జగదాంబకు అత్యంత ప్రియమైన భక్తురాలు. బ్రహ్మచారి అయిన సేవాలాల్ తన అద్వితీయ బోధనలతో విజయం సాధించాడు. దీంతో ఆయన వెంట చాలా మంది భక్తులు వచ్చారు. 18వ శతాబ్దంలో బంజారాలు, నిజాం, మైసూర్ పాలకుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక పాత్ర పోషించారు.

చదవండి: AP &TS టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

బ్రిటీష్, ముస్లిం పాలకుల ప్రభావంతో పాటు బంజారాలు ఇతర సంప్రదాయాల్లోకి మారకుండా ఉండేందుకు సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. అలా బంజారాల ఆరాధ్యదైవం అయ్యాడు. లిపి లేని బంజర్ భాషకు సేవాలాల్ మహారాజా ఒక రూపాన్ని కూడా అందించారు. లక్షలాది బంజారాలు… స్థిర నివాసం లేకపోయినా, బంజారాలు తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైన వస్త్రాలు, ఆభరణాలతో తమ ప్రత్యేకతను నిలుపుకోవడం.. సంత్ సేవాలాల్ కృషి ఫలితమే. ఈ కారణంగా, బంజర్లు అతనిని విగ్రహంగా భావిస్తారు.. ప్రతి సంవత్సరం అతని జయంతిని జరుపుకుంటారు. 

ఈ ఫిబ్ర‌వ‌రి సాధార‌ణంగా స్కూల్స్‌, కాలేజీల‌కు సాధార‌ణ సెల‌వులు లేవ్‌. కానీ అనుకోకుండా ప్ర‌భుత్వం ఇచ్చిన సెల‌వుల‌తో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు వ‌స్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ ర‌థ‌స‌ప్త‌మి పండ‌గ ఉంది. ర‌థ‌స‌ప్త‌మి పండ‌గ కూడా కొన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఒక వేళ ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ ప్ర‌భుత్వం సెల‌వు ఇస్తే.. వ‌రుస‌గా మ‌రో సారి రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..

holidays news telugu

☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

Published date : 12 Feb 2024 08:00AM

Photo Stories