Telangana Diwali Schools and Colleges Holiday Change : తెలంగాణ‌లో కూడా దీపావళి సెలవు మార్పు.. ఆ రోజు నుంచి వ‌రుస‌గా మూడు రోజులు పాటు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఎట్ట‌కేలకు దీపావళి పండ‌గ‌కు న‌వంబ‌ర్ 10వ తేదీన‌(శుక్ర‌వారం) శుభ‌వార్త చెప్పింది. దీపావళి పండ‌గ సెల‌వు తేదీని మారుస్తు కీలక నిర్ణ‌యం తీసుకుంది.

మాములుగా అయితే ఈ పండుగ ఆదివారం(నవంబర్ 12వ తేదీ) రోజున వ‌చ్చింది. తెలంగాణ‌లో స్కూల్స్, కాలేజీల విద్యార్థులతో పాటు.. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగులు కుడా నిరాశ‌లో ఉన్న విష‌యం తెల్సిందే. అయితే మేర‌కు ఉద్యోగ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి విజ్ఞప్తి చేసుకోవ‌డంతో.. ఈ సెల‌వు తేదీని న‌వంబ‌ర్ 13వ తేదీన (సోవ‌వారం)కు మారుస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌రుస‌గా మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.\

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

వ‌రుసగా మూడు రోజులు పాటు..

ఈ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు అత్యంత ఘ‌నంగా జరుపుకుంటారు. దీపావళి అంటే.. ఎక్క‌వ‌గా పిల్ల‌ల‌కు చాలా ఇష్ట‌మైన పండుగ. ఎందుకుంటే.. పిల్లలు పెద్ద‌లు.. అంద‌రు సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటారు. అయితే వీరి కోసం ప్ర‌భుత్వం నేడు శుభ‌వార్త చెప్పింది. ఈ సెల‌వును అక్టోబ‌ర్ 13వ తేదీకి (సోమ‌వారం) మారుస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది, ఈ మేర‌కు తెలంగాణ సీఎస్  కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ‌లో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు శ‌నివారం, ఆదివారం, సోమ‌వారం వ‌రుసగా మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. అలాగే ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు కూడా మూడు రోజులు పాటు సెల‌వు ఉండ‌నున్నాయి.

విద్యార్థుల‌తో పాటు.. ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా..

దీపావళి పండుగకు ఆశ్వయుజ  బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్‌ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ  నవంబర్‌ 12నే  జరుపుకోవాలని పంచాగకర్తలు అంటున్నారు.  మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో  నవంబర్‌ 12వ తేదీనే దీపావళి పండుగని వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు. అయితే తెలంగాణ‌ ప్ర‌భుత్వం న‌వంబ‌ర్ 13వ తేదీ (సోమ‌వారం)న కూడా సెల‌వు ఇవ్వ‌డంతో స్కూల్స్ , కాలేజీల‌ విద్యార్థుల‌తో పాటు.. ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

☛ November Schools and Colleges Holidays List 2023 : నవంబర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌చ్చే సెల‌వులు ఇవే.. దాదాపు 10 రోజులు పాటు..

#Tags