RUSA Project : అర్హత, ఆసక్తి ఉన్నవారికి రుసా ప్రాజెక్టులో పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానం..
వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డికు మంజూరైన రూసా ప్రాజెక్టులో ‘ప్రాజెక్టు ఫెలో’గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.జి. రవీంద్రనాథ్ తెలిపారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద మంజూరైన పరిశోధనలో రెండు సంవత్సరాల పాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన ఎంఎస్సీ ఫిజిక్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నెలకు రూ.12 వేలు వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. గేట్/నెట్/సెట్/ఆర్‌సెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డాక్టర్ బి. సుధాకర్‌రెడ్డిని 9440921413 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
IGNOU Admissions: ఇగ్నో- 2024 ప్రవేశాలకు ప్రవేశాల గడువు పొడిగింపు.. ఇలా అప్లై చేసుకోండి
Tags
- RUSA Project
- Candidates
- participation in rusa project
- Applications
- Govt men's college
- physics professors
- Project Fellow
- Rashtriya Uchhatar Shiksha Abhiyan
- Education News
- Sakshi Education News
- Dr. Busireddy Sudhakar Reddy
- Physics professor Kadapa
- Government Men's College
- Dr. G. Rabindranath invitation
- Education event news
- rusaproject