Skip to main content

ITI Admissions: ఏపీ, తెలంగాణల్లో ఐటీఐ ప్రవేశాలు ప్రారంభం.. అర్హులు వీరే!

పదో తరగతి తర్వాత సత్వర ఉపాధికి మార్గం.. ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఐటీఐ)! ఇవి అందించే కోర్సులు పూర్తి చేసుకుంటే.. సంబంధిత విభాగంలో ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతమవుతాయి. దీంతో తక్షణమే ఉపాధి పొందేందుకు వీలవుతుంది. ఐటీఐ కోర్సులతో ఉన్నత విద్య అవకాశాలు కూడా అందుకోవచ్చు..
Industrial Training Institutes admissions 2024 at AP and Telangana

సాక్షి ఎడ్యుకేష‌న్‌: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఐటీఐల్లో ప్రవేశ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణల్లో ఐటీఐల్లో ప్రవేశాల వివరాలు, అవి అందించే ట్రేడ్స్, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

తెలుగు రాష్ట్రాల్లోని ఐటీఐలు ఇంజనీరింగ్, నాన్‌–ఇంజనీరింగ్‌ విభాగాల్లో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌ ట్రేడులుగా పేర్కొంటారు. పదో తరగతి అర్హతతో సంవత్సరం, రెండేళ్ల వ్యవధితో కోర్సులను అందిస్తున్నారు. పలు ట్రేడుల్లో ఎనిమిదో తరగతితోనూ ప్రవేశం పొందే అవకాÔ¶ ముంది. అధికారిక గణాంకాల ప్రకారం–ఆంధ్రప్రదేశ్‌లో 82 ప్రభుత్వ, 428 ప్రైవేట్‌ ఐటీలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 63 ప్రభుత్వ ఐటీఐలు, 211 ప్రైవేట్‌ ఐటీఐలు ఉన్నాయి.

M Tech Admissions: మనూలో ఎంటెక్‌ పార్ట్‌టైమ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

40కు పైగా ట్రేడ్స్‌
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐటీఐలు 40కు పైగా ట్రేడ్‌లు అందిస్తున్నాయి. వీటిలో నాన్‌–ఇంజనీరింగ్‌ విభాగంలో.. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రెస్‌ మేకింగ్, డ్రైవర్‌ కమ్‌ మెకానిక్, ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, హాస్పిటల్‌ హౌస్‌ కీపింగ్, ఐఓటీ టెక్నిషియన్, రేడియాలజీ టెక్నిషియన్, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్, స్యూయింగ్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ ఫోన్‌ టెక్నిషియన్‌ కమ్‌ యాప్‌ టెస్టర్, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్, డెంటల్‌ లేబరేటరీ ఎక్విప్‌మెంట్‌ టెక్నిషియన్‌ ట్రేడులు ఉన్నాయి.

ఇంజనీరింగ్‌లో ట్రేడ్స్‌ ఇవే
ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌/మెకానిక్‌), ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్‌ (గ్రైండర్‌), మోటార్‌ వెహికిల్‌ మెకానిక్, ఆటో బాడీ పెయింటింగ్‌ మెకానిక్, ఆటో బాడీ రిపెయిర్‌ మెకానిక్, ఆటో ఎలక్ట్రిషియన్‌ అండ్‌ ఎలక్రానిక్స్‌ మెకానిక్, డీజిల్‌ మెకానిక్, జనరల్‌ పెయింటర్, ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ టెక్నిషియన్, షీట్‌ మెటల్‌ వర్కర్, సోలార్‌ టెక్నిషియన్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్‌ ట్రేడ్‌ల్లో ప్రవేశం కల్పిస్తున్నారు.

Posts at BSF: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

కోర్సుల వ్యవధి వేర్వేరుగా

ఐటీఐల్లో ఇంజనీరింగ్, నాన్‌–ఇంజనీరింగ్‌ ట్రేడ్‌లు అందుబాటులో ఉండగా.. వీటి కోర్సుల వ్యవధి వేర్వేరుగా ఉంది. అన్ని బ్రాంచ్‌లకు సంబంధించి ఆయా కోర్సుల వ్యవధి ఏడాది, రెండేళ్లుగా ఉంది.ఇంజనీరింగ్‌ ట్రేడ్‌లకు సంబంధించి మాత్రం ఎక్కువ శాతం రెండేళ్ల వ్యవధిలోనే ఉన్నాయి.

ప్రాక్టికల్‌ నైపుణ్యాలు
ఐటీఐల్లో క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్, డ్యూయల్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ విధానాల్లో శిక్షణనిస్తారు. దీంతో ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థు­లు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నిర్దిష్ట వ్యవధిలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అవకాశం కూడా కల్పిస్తారు. సాధారణంగా 70 శాతం సమయాన్ని ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌కు, మిగతా 30 శాతాన్ని థియరిటికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చేలా కరిక్యులం అమలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కోర్సు వ్యవధిలో దాదాపు మూడో వంతు లేదా సగం కంటే ఎక్కువగా సమయాన్ని క్షేత్ర నైపుణ్యాలు పొందేందుకు కేటాయిస్తున్నారు. దీంతో ఐటీఐ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి.

Veterinary Staff Posts: బీఎస్‌ఎఫ్‌లో వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు..

ట్రేడ్‌ టెస్ట్‌కు అర్హత
ఐటీఐలలో ఆయా ట్రేడ్‌లలో కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ నిర్వహించే ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌కు హాజరయ్యే అర్హత లభిస్తుంది. ఈ ట్రేడ్‌ టెస్ట్‌­లో ఉత్తీర్ణత సాధించిన వారికి సదరు కంపెనీల్లో అప్రెంటీస్‌ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇంజనీరింగ్‌ ట్రేడ్‌లకు సంబంధించి ట్రేడ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణతను కొన్ని సంస్థలు తప్పనిసరి చేస్తున్నాయి. కాబట్టి ఐటీఐ ఉత్తీర్ణులయ్యాక ట్రేడ్‌ టెస్ట్‌లోనూ విజ­యం సాధిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

అప్రెంటిస్‌
ఐటీఐ పూర్తి చేసుకున్న వారు జాతీయ స్థాయిలో అమలవుతున్న నేషనల్‌ అప్రెంటీస్‌ ప్రమోషన్‌ స్కీమ్‌కు కూడా అర్హత పొందుతారు. ఎన్‌ఏపీఎస్‌ పోర్టల్‌లో తమ పేరు, అర్హతలు, ట్రేడ్‌ వివరాలు నమోదు చేసుకుంటే.. అప్రెంటీస్‌ ట్రైనీ నియామకాలు చేపట్టే సంస్థలు అప్రెంటీస్‌ ట్రైనీగా ఎంపిక చేసుకుంటాయి. అప్రెంటీస్‌ శిక్షణ సమయంలో నెలకు గరిష్టంగా రూ.9వేల వరకు స్టయిఫండ్‌ పొందొచ్చు. శాశ్వత ఉద్యోగుల సంఖ్య 30 మంది ఉన్న సంస్థలు అప్రెంటీస్‌ ట్రైనీలను నియమించుకునే విధంగా ఎన్‌ఏపీఎస్‌ విధానాలను రూపొందించారు. దీంతో ఐటీఐ పూర్తి చేసుకున్న వారికి అప్రెంటీస్‌ అవకాశాలు లభిస్తున్నాయి.

SI and Constable Posts: బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ..!

ఉద్యోగ సాధనలో ముందంజ
ఐటీఐ పూర్తి చేసుకున్న వారు ఉద్యోగ సాధనలోనూ ముందుంటున్నారనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ఇంజనీరింగ్‌ ట్రేడ్‌లు ఉత్తీర్ణులైతే టెక్నిషియన్స్, ఫ్లోర్‌మెన్‌ ఉద్యోగాలు లభిస్తాయి. వీరికి నెలకు రూ.20 వేల వరకూ వేతనం అందుతోంది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ వంటి నాన్‌ ఇంజనీరింగ్‌ ట్రేడ్‌లు పూర్తి చేసుకున్న వారికి చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఆఫీస్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

సర్కారీ కొలువులు
ఐటీఐ పూర్తి చేసుకున్న వారు సర్కారీ కొలువు­లూ సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలకు పోటీ పడే అవకాశముంది. ముఖ్యంగా రైల్వేలో టెక్నికల్‌ విభాగంలో అసిస్టెంట్‌ లోకో పైలట్, ఇతర టెక్నికల్‌ విభాగాల్లో టెక్నిషియన్‌ గ్రేడ్‌–3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవరత్న, మహారత్న, మినీరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా టెక్నిషియన్‌ కొలువులు దక్కించుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో జూనియర్‌ లైన్‌మెన్, డిప్యూటీ సర్వేయర్‌ కొలువులతోపాటు విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

Agniban Rocket: అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా.. కార‌ణం ఇదే..

స్వయం ఉపాధి
ఐటీఐ పూర్తి చేసుకున్న వారు స్వయం ఉపాధి కూడా పొందొచ్చు. ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానిక్‌ వంటి ట్రేడ్‌లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు సొంతంగా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించుకునే అవకాశం ఉంది. ఈ ట్రేడ్‌ల అభ్యర్థులు సొంతంగా యూనిట్స్‌ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడంతోపాటు మరికొందరికి ఉపాధి కల్పించొచ్చు.

ప్రవేశాలు ఇలా
ఏపీ, తెలంగాణలోని ఐటీఐలలో.. ప్రవేశాల కోసం అభ్యర్థులు నిర్దేశిత వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ క్రియేట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఈ అప్లికేషన్‌ను పూర్తి చేసే సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న ట్రేడ్‌లు, ఐటీఐలను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు నిర్దేశిత తేదీలోపు సంబంధిత ఐటీఐలో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

ముఖ్య సమాచారం

  •     ఏపీ ఐటీఐల్లో దరఖాస్తు చివరి తేదీ: 2024, జూన్‌ 10
  •     తెలంగాణ ఐటీఐల్లో దరఖాస్తు చివరి తేదీ: 2024 జూన్‌ 10
  •     ఏపీ ఐటీఐ ప్రవేశాలకు వెబ్‌సైట్‌: https://itiadmissions.ap.gov.in/iti
  •     తెలంగాణ ఐటీఐ ప్రవేశాలకు వెబ్‌సైట్‌: https://tsiti.ucanapply.com

 Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టాటా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు

Published date : 29 May 2024 03:38PM

Photo Stories