Skip to main content

SI and Constable Posts: బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ..!

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ గ్రూప్‌–బి, సి(నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 SI Constable Group B C positions  Applications for SI and Constable posts at Border Security Force  Union Ministry of Home Affairs

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 37
»    పోస్టుల వివరాలు: ఎస్‌ఐ(వెహికల్‌ మెకానిక్‌)–03, కానిస్టేబుల్‌(ఓటీఆర్‌పీ)–01, కానిస్టేబుల్‌(ఎస్‌కేటీ)–01, కానిస్టేబుల్‌(ఫిట్టర్‌)–04, కానిస్టేబుల్‌(కార్పెంటర్‌)–02, కానిస్టేబుల్‌(ఏఈ)–01, కానిస్టేబుల్‌(వెహికల్‌ మెకానిక్‌)–22, కానిస్టేబుల్‌ (బీఎస్‌టీఎస్‌)–02, కానిస్టేబుల్‌(అప్‌హోల్‌స్టర్‌)–01.
»    అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ(ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌/ మెకానికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: గ్రూప్‌–బి పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గ్రూప్‌–సి పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»    వేతనం: నెలకు గ్రూప్‌–బి పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400, గ్రూప్‌–సి పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్‌/ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.06.2024.
»    వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

Delhi Technological University: ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో ఎంబీఏ–డీఎస్‌ఏ ప్రవేశాలు..

Published date : 29 May 2024 04:30PM

Photo Stories