Skip to main content

Agniban Rocket: అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా.. కార‌ణం ఇదే..

అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా ప‌డింది.
Agniban Rocket Launch Postponed Again Due to Technical Issues

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సాంకేతిక లోపాల కారణంగా ఈ రాకెట్‌ ప్రయోగం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. అందులో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిదిద్ది మే 28వ తేదీ ప్రయోగానికి సిద్ధం చేశారు. అయితే, ప్రయోగానికి కొద్ది సెకన్ల ముందు మరోసారి సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రయోగాన్ని నిలిపివేశారు. అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (చెన్నై) అనే ప్రైవేటు ఎస్‌ఓఆర్‌ టీఈడీ మిషన్‌–01 అనే ఈ చిన్న తరహా రాకెట్‌ను రూపొందించింది.
 
సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని ధనుష్‌ రాకెట్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ఏడాది మార్చి 22న తొలిసారి దీనిని ప్రయోగానికి సిద్ధం చేశారు. చివర్లో సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. మళ్లీ ఏప్రిల్‌ నెల 6న మరోసారి ప్రయోగానికి సిద్ధమైనప్పటికీ, సాంకేతికపరమైన కారణాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా పడింది.

Railway System On Moon: చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు స్టేషన్‌ను నిర్మించనున్న నాసా..

వీటిన్నింటినీ అధిగమించి మే 28వ తేదీ తెల్లవారు­జామున 5.45 గంటలకు మరోసారి ప్రయోగానికి పూనుకొన్నారు. 6 గంటల ముందు నుంచి (27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి) కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఆఖర్లో 11 సెకన్లకు ముందు కమాండ్‌ కంట్రోల్‌ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. తదుపరి ప్రయోగ తేదీని నిర్దిష్టంగా ప్రకటించలేదు.

Published date : 30 May 2024 12:56PM

Photo Stories