Eighth Class Admissions 2025 : ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు.. పరీక్ష విధానం ఇలా..!
» అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2025, జూలై 1వ తేదీ నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
» వయసు: 01.07.2025 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. అంటే.. 02.07.2012 నుంచి 01.01.2014 మధ్య జన్మించి ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్ (125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వాయిస్ కలిపి మొత్తం 450 మార్కులకు ఉంటుంది. కనీస ఉత్తీర్ణతా మార్కులు 50 శాతం ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 30.09.2024.
» పరీక్ష తేది: 01.12.2024.
» వెబ్‌సైట్: https://psc.ap.gov.in
RBI Recruitment 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్–బి పోస్టులు..
Tags
- APPSC-RIMC
- eighth class admissions
- admissions notifications
- online applications
- entrance exam dates
- Andhra Pradesh Public Service Commission
- rashtriya indian military college
- RIMC Admissions
- Eligible students
- Education News
- Sakshi Education News
- APPSC
- RIMC
- dehradun
- MilitaryCollege
- EighthClassAdmissions
- andhrapradesh
- Admission2025
- RashtriyaIndianMilitaryCollege
- latest admissions in 2024
- sakshieducation latest admissons in 2024