Skip to main content

Sixth Class Admissions : కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశాలు

కిత్తూరు (కర్ణాటక)లోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి­లో ప్రవేశాలకు బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Kittur Rani Chennamma Residential Sainik School Class VI Admissions  Kittur Rani Chennamma Residential Sainik School for Girls admission  Entrance examination details for Kittur Rani Chennamma School  Application form for Class VI admission at Kittur Rani Chennamma School

ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు.  ఈ పాఠశాలలో ప్రవేశం పొందిన బాలికలు 12వ తరగతి(సైన్స్‌ స్ట్రీమ్‌) వరకు చదువుకోవచ్చు. సీబీఎస్‌ఈ విధానంలో బోధన ఉంటుంది.
»    అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
»    వయసు: విద్యార్థినులు 2025 జూన్‌ 01 నాటికి పదేళ్లు నిండి పన్నెండేళ్లలోపు ఉండాలి.
»    ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందిన వారికి ఇంటర్వ్యూలు, ఫిజికల్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    పరీక్ష విధానం: పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ మ్యాథమేటిక్స్‌(150 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌(50 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌(50 మార్కులు), ఇంటెలిజెంట్‌ కోషంట్‌/మెంటల్‌ ఎబిలిటీ–50 మార్కులకు పరీక్ష  నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఇంగ్లిష్, కన్నడ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.12.2024
»    ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 31.12.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 02.02.2025.
»    పరీక్ష కేంద్రాలు: కిత్తూర్, విజయపూర్, బెంగళూరు, కలబురగి.
»    వెబ్‌సైట్‌: https://kittursainikschool.org

 Job Mela: డిగ్రీ అర్హతతో ఈనెల 26న జాబ్‌మేళా

Published date : 24 Oct 2024 12:36PM

Photo Stories