1.25-crore salary package: అదరగొట్టిన ఐఐఐటీ విద్యార్థి... కోటి 25 లక్షల ప్యాకేజీతో శభాష్ అనిపించిన అనురాగ్
కానీ, ఒక ఐఐఐటీ విద్యార్థి ఐఐటీ, ఐఐఎంల విద్యార్థులతో పోటీపడి అత్యధిక ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. ఆ విద్యార్థి ఎవరు, అతని నేపథ్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన అనురాగ్ హకాడే అలహాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో బీటెక్ చదువుతున్నాడు. గతేడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో రికార్డు ప్యాకేజీ దక్కించుకుని అబ్బురపరిచాడు.
అలహాబాద్ ఐఐఐటీలో చదువుతున్న సమయంలోనే అనురాగ్ తన ఇంటర్న్‌షిప్‌ను బెంగళూరులోని క్యూర్ ఫిట్ కంపెనీలో తర్వాత గుర్‌గ్రాంలోని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో అనలిస్ట్ ఇంటర్న్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే కోడింగ్‌పై పట్టుసాధించాడు.
బీటెక్ చివరి సెమిస్టర్ సమయంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో తన ఇంటర్న్‌షిప్ తనకు ఎంతగానో దోహదపడింది. అదే అతనికి అత్యధిక వేతనం అందేలా చేసింది. అనురాగ్‌కు రూ.1.25 కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసి అమెజాన్ ఎగరేసుకుపోయింది.
➤☛ మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
ప్రస్తుతం అనురాగ్.. అమెజాన్ లో ఫ్రంట్ ఎండ్ ఇంజినీర్‌గా ఉన్నాడు. దీనిపై 2022 సెప్టెంబర్‌లో స్పందిస్తూ.. అమెజాన్‌లో ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఫుల్‌టైం ఫ్రెంటెండ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నానంటూ పోస్ట్ చేశారు.
అనురాగ్‌తో పాటు ఐఐఐటీ అలహాబాద్ లో నిర్వహించిన ప్లేస్ మెంట్లలో అనేకమంది విద్యార్థులు అత్యధిక వేతనాలను సాధించారు. వీరిలో ప్రథమ్ ప్రకాశ్ గుప్తా గూగుల్ నుంచి రూ.1.4 కోట్ల ప్యాకేజీని పొందగా, పాలక్ మిట్టల్ రూ.కోటికి పైగా ప్యాకేజీతో అమెజాన్లో మంచి ప్లేస్మెంట్ పొందారు. అఖిల్ సింగ్ రూ.1.2 కోట్ల ప్యాకేజీతో రుబ్రిక్ లో ఉద్యోగం సాధించాడు.