Samagra shiksha abhiyan: పోస్టుల భర్తీలో నిబంధనలు
పట్టా పాస్‌బుక్ ఇస్తలేరు..
7/7 సర్వేనంబర్‌లో ఎకరం భూమి రికార్డులో చూపిస్తుంది. అయినా పట్టా పాస్‌బుక్ ఇస్తలేరు. భూమి కూడా నేనే కాస్తు చేస్తున్న. ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా పని జరగడం లేదు.
– మచ్చ నర్సింహరాములు, రాయపర్తి
Also read: Open Tenth అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు
దళితబంధు ఇప్పించాలి..
దివ్యాంగుడినైన తనకు దళితబంధు పథకం వర్తింపజేసి ఉపాధి కల్పించాలి. ఇప్పటికీ చాలాసార్లు దరఖాస్తు చేసుకున్న. మా అమ్మ పేరుమీద డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉందంటున్నారు. ఇప్పుడేమో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోమంటున్నారు. మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– తాటికాయల సతీష్‌బాబు, వర్ధన్నపేట
Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation
పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలి..
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ వరంగల్ అధ్యక్షుడు మంద శ్యామ్ డిమాండ్ చేశారు. పంచాయతీల్లో పని చేసే స్వీపర్లు, ఎలక్ట్రీషియన్‌లు, కారోబార్లు, బిల్ కలెక్టర్‌ల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.