Skip to main content

Free training for women in business: వ్యాపారంలో మహిళలకు ఉచిత శిక్షణ

 Union Bank Rural Employment Training Institute conducting free training for rural women   Free training for women in business   GMR Varalakshmi Foundation providing free entrepreneurship training to rural women
Free training for women in business

వికారాబాద్‌ అర్బన్‌: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ, జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌, స్వర్ణ భారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు చిరు వ్యాపారాలపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సంచాలకులు జీ.ఎస్‌.ఆర్‌.కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బ్యూటీషియన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ


పచ్చళ్లు, కారం పొడులు, తృణ ధాన్యాలతో స్నాక్స్‌ తయారు చేయడం వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఫోన్‌ నంబర్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు.

19 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. 10రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

శిక్షణ పూర్తి చేసుకున్న వారు బ్యాంక్‌ రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు, పేర్ల నమోదుకు సెల్‌ నంబర్‌ నెంబర్‌: 93914 87797, 9177141712, 96185 34720, 6301890681లలో సంప్రదించాలన్నారు.

Published date : 11 Mar 2024 10:19AM

Photo Stories