Skip to main content

Dussehra Holidays 2022 : ఈ సారి స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అందించింది. ఈ ఏడాది దసరా పండుగకు 13 రోజులపాటు సెలవులను అధికారికంగా సెప్టెంబ‌ర్ 13వ తేదీ (మంగ‌ళ‌వారం) ప్రకటించింది.
TS Dasara holidays
Holidays

దసరా పండుగ నేపథ్యంలో సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు (15 రోజులు) సెలవులు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక, అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి దుర్గాదేవి న‌వ‌రాత్రి ఉత్సవాల‌కు(దసరా) ఈ సారి స్కూల్స్‌, కాలేజీ  భారీగా సెల‌వుల‌ను ఇచ్చారు.

➤ Dussehra Holidays : ద‌స‌రా పండుగకు 22 రోజులు సెల‌వులు.. ఇక స్కూల్స్‌, కాలేజీ పిల్ల‌లకు అయితే..

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.

➤ TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

ఈ విద్యాసంవత్సరంలో సెల‌వులు, పనిదినాలను ఒక‌సారి పరిశీలిస్తే..

Schools and Colleges Holidays

☛ ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు
☛ ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
☛ వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు
☛ ప్రైమరీ స్కూల్స్‌ల‌కు ఉదయం 9AM నుంచి 4PM వరకు తరగతులు
☛ ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం 9AM నుంచి 4.15PM వరకు తరగతులు
☛ ఉన్నత పాఠశాలల తరగతులకు ఉదయం 9.30AM నుంచి 4.45 PM వరకు తరగతులు
☛ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు).. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి 16 రోజులు సెలవులు రానున్నాయి.
☛ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
☛ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు)

Dussehra Holidays : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్కూల్స్‌కు దస‌రా హాలీడేస్ ఎన్ని రోజులంటే..?

Published date : 13 Sep 2022 03:02PM

Photo Stories