Dussehra Holidays : ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్‌కు దసరా హాలీడేస్ ఎన్ని రోజులంటే..?
సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులను(10 రోజులు) ఇవ్వనున్నారు. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు మాత్రం దసరా సెలవులు అక్టోబరు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో ముందుగా దసరా సెలవుల గురించి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.
➤ Dussehra Holidays : దసరా పండుగకు 22 రోజులు సెలవులు.. ఇక స్కూల్స్, కాలేజీ పిల్లలకు అయితే..
తెలంగాణలో మాత్రం భారీగానే సెలవులు..
తెలంగాణలో స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు ఈ సారి నిజంగా గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చును. ఈ సంవత్సరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు(దసరా) తెలంగాణలో సెలవులు భారీగా ఇవ్వనున్నారు . సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14 రోజులు).., అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించిన విషయం తెల్సిందే.
➤ TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..
తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లకు ముందుగానే హాలీడేస్ మంజూరు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి.