Summer Holidays 2023 : కాలేజీలకు వేసవి సెలవులు ఇవే..!
ఈ పరీక్షలు మార్చి 28వ తేదీన ఫస్టియర్, మార్చి 29వ తేదీన సెకండియర్ పరీక్షలు ముగిశాయి.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
సంతోషంగా ఇంటి బాట..
దీంతో ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన తెలంగాణ విద్యార్థులు నేటి నుంచి రిలాక్స్ అవ్వనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి తిరిగి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు హాస్టల్ లో ఉంటూ చదువుతున్న విద్యార్థులు సంతోషంగా ఇంటికి పయనమయ్యారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మాత్రం.. ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
TS Exams: ఏప్రిల్ అంతా పరీక్షా కాలమే... తెలంగాణలో ఏయే ఎగ్జామ్ ఎప్పుడెప్పుడంటే
దాదాపు 9,48,010 మంది విద్యార్థులకు..
ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు.
ఫలితాలు మాత్రం..
పరీక్షలు ముగియడంతో ఇంటర్ బోర్డ్ పేపర్ల వాల్యుయేషన్ పై దృష్టి సారించింది. గత వారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది.గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాల్యుయేషన్, టేబులేషన్ లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డ్. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
NEET UG 2022 All India 5th Ranker : చదివిన కొద్దిసేపైనా ఇలా చదివే వాడిని.. నా లక్ష్యం ఇదే..
మూల్యాంకనం ఇలా..
ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్‌లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇక ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్