TS Exams: ఏప్రిల్ అంతా పరీక్షా కాలమే... తెలంగాణలో ఏయే ఎగ్జామ్ ఎప్పుడెప్పుడంటే
మార్చి - 31
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్‌జేసీ పరీక్ష మార్చి 31వ తేదీ నిర్వహించనున్నారు.
ఏప్రిల్ - 6
ఏప్రిల్ 6వ తేదీ నుంచి పరీక్షలు మొదలవనున్నాయి. 6వ తేదీ రెండు పరీక్షలు జరగనున్నాయి. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ వ్యాప్తంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్, అలాగే తెలంగాణ లా సెట్ ఏప్రిల్ 6న జరగనుంది.
చదవండి: ఏపీలో పలు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల... పరీక్షలు ఎప్పుడంటే
ఏప్రిల్ - 10
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 10వ తేదీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023ను నిర్వహించనుంది. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్‌టీయూఎహెచ్) నిర్వహించనుంది.
ఏప్రిల్ - 16
మహాత్మాజ్యోతిబాపులే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.. రాష్ట్రంలోని వివిధ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 16న జరగనుంది. ఈ పరీక్ష ఆధారంగా ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏప్రిల్ - 20
ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే బీఈడీ తప్పనిసరి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్-2023 పరీక్ష ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు.
ఏప్రిల్ - 25
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా(ఇంజనీరింగ్, నాన్-ఇంజీనీరింగ్/టెక్నాలజీ) సీట్లను పాలీసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీచేస్తారు. ఈ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ జరగనుంది.
చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
ఏప్రిల్ - 30
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీఈసెట్-2023 ఎగ్జామ్ ఏప్రిల్ 30న జరగనుంది. ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఇందులో వచ్చే ర్యాంకే ఆధారం.
మే - 2
ఇంజినీరింగ్ కాలేజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ మే 2వ తేదీ నిర్వహించనున్నారు.
చదవండి: ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23
మే - 6
రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష మే 6వ తేదీ జరగనుంది.
మే - 12
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మే 12వ తేదీ జరగనుంది.