AP Budget 2023-24 Highlights : రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఏఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?
2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉంది.
AP Budget 2023-24 Live Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24 లైవ్ అప్‌డేట్స్
ఏఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?
☛➤ అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
☛➤ మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
☛➤ ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
☛➤ వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు
☛➤ వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు
☛➤ వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
☛➤ జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
☛➤ జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
☛➤ వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
☛➤ డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
☛➤ రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
☛➤వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
☛➤ జగనన్న చేదోడు రూ.350 కోట్లు
☛➤ వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు
☛➤ వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
☛➤వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
అధిక ప్రాధాన్యత వీటికే..
☛ నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం.
☛ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్
☛ మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు.
☛ వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట
☛ పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు.
☛ వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది.
☛ నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేశారు
☛ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశారు. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించారు.