Buggana Rajendranath Reddy: విద్యా హబ్‌గా గోరుమాన్‌కొండ
అక్టోబర్ 19న సాయంత్రం మంత్రి బేతంచెర్ల – బనగానపల్లె రహదారిలో గోరుమాన్‌కొండ గ్రామ సమీపంలో రూ. 36 కోట్లతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే సమీపంలో వివిధ వృత్తి పనుల వారికి నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ సెంటర్‌ను, రూ.7.8 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ కళాశాల భవనాన్ని మంత్రి పరిశీ లించారు.
చదవండి: PG Reddy: న్యూబొప్పారం వాసికి చరిత్ర విభాగంలో డాక్టరేట్
పనులన్నీ డిసెంబర్‌లో గా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, కళాశాల భవన నిర్మాణంలో అత్యాధునిక వసతుల కల్పనలోకు మరో రూ. 3కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే బేతంచెర్ల పట్టణంలో రూ.80 లక్షలతో కొత్తగా నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ ఇన్స్‌ఫెక్షన్ బంగ్లా పనులను మంత్రి బుగ్గన పరిశీలించి పలు సూచనలు చేశారు. మంత్రి వెంట ఆర్‌అండ్‌బీ ఏఈ మునిస్వామి తదితరులు ఉన్నారు.